Tamannaah : విజయ్ వర్మతో రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చిన తమన్నా.. అతను నా హ్యాపీ ప్లేస్ అంటూ..

ఇటీవల నెట్‌ఫ్లిక్స్ నుంచి లస్ట్ స్టోరీస్ 2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తమన్నా, విజయ్ వర్మ జంటగా నటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఈ సినిమా షూటింగ్ లోనే వీరు జంటగా మారి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో మొదటిసారి తమన్నా విజయ్ వర్మతో రిలేషన్ షిప్ గురించి మాట్లాడింది.

Tamannaah : విజయ్ వర్మతో రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చిన తమన్నా.. అతను నా హ్యాపీ ప్లేస్ అంటూ..

Tamannaah gives clarity on Relationship with Vijay Varma

Vijay Varma :  స్టార్ హీరోయిన్ తమన్నా(Tamannaah) ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు దాటినా ఇప్పటికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమా ఛాన్సులు సంపాదిస్తుంది. ఇటీవల బాలీవుడ్(Bollywood) నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో రిలేషన్ లో ఉందని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. విజయ్ – తమన్నా కలిసి పార్టీలకు వెళ్లడం, కలిసి ఈవెంట్స్ కి వెళ్లడం, గోవాలో వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చెయ్యడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి.

అయితే ఈవార్తలపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ నుంచి లస్ట్ స్టోరీస్ 2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తమన్నా, విజయ్ వర్మ జంటగా నటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఈ సినిమా షూటింగ్ లోనే వీరు జంటగా మారి ఉంటారని అంతా భావిస్తున్నారు. త్వరలో లస్ట్ స్టోరీస్ 2 రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండి. ఈ ప్రమోషన్స్ లో మొదటిసారి తమన్నా విజయ్ వర్మతో రిలేషన్ షిప్ గురించి మాట్లాడింది.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ప్రశ్నించగా తమన్నా మాట్లాడుతూ.. మన కో యాక్టర్స్ అయినంత మాత్రాన వాళ్లకి అట్రాక్ట్ అయిపోము. అలా అనుకుంటే ఇప్పటివరకు నేను చాలా మంది కో యాక్టర్స్ తో కలిసి పనిచేశాను. పర్సనల్ గా మనకు డిఫరెంట్, సంథింగ్ స్పెషల్ అనిపించాలి అని చెప్పింది. లస్ట్ స్టోరీస్ టైంలోనే మీ ఇద్దరు క్లోజ్ అయ్యారా అని అడగగా.. అవును, నేను ఎదురు చూస్తున్న వ్యక్తి ఇతనే. నేను ఆర్టిఫీషియల్ గా కాకుండా చాలా సహజంగా కలవాలనున్నాను. ఇతన్ని అలాగే కలిశాను. అతను నాకు రక్షణగా నిలబడ్డాడు. సాధారణంగా ఇక్కడ మన ఎవర్ని అయినా లైఫ్ పార్ట్నర్ చేసుకుంటే వారి కోసం చాలా మారాలి. ఫిజికల్ గా, మెంటల్ గా చాలా మార్చుకోవాలి. కానీ సక్సెస్ చూసిన అమ్మాయిలు ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళను అర్ధం చేసుకొని, వారికి అండగా నిలబడే వాళ్ళు రావాలనుకుంటారు. నేను కూడా నా ప్రపంచాన్ని అర్ధం చేసుకునే వాళ్లే రావాలనుకున్నాను. అతను ప్రస్తుతానికి నా హ్యాపీ ప్లేస్ అని తెలిపింది.

Prabhas Srinu : ప్రభాస్ శ్రీనుకు ఆ పేరు ఎలా వచ్చింది? ప్రభాస్ తో ఎక్కడ పరిచయం? వాళ్లిద్దరూ మరీ అంత క్లోజా??

దీంతో తమన్నా, విజయ్ వర్మ నిజంగానే లవ్ లో ఉన్నట్టు క్లారిటీ వచ్చేసింది. మరి వీరు ఈ లవ్ స్టేజిని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తారో చూడాలి.