Dhurandhar: తమన్నా ఉంటే అందరు ఆమెనే చూస్తారు.. అందుకే రిజెక్ట్ చేశాడట పాపం
బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్(Dhurandhar). స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించాడు. పేట్రియాటిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్నీ సాధించింది.
Tamannaah is the first choice for Dhurandhar Movie special song.
Dhurandhar: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్. స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించాడు. పేట్రియాటిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్నీ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం కాసులే కాదు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుందో ఈ సినిమా. ఇండియన్ సినిమా స్టార్స్ కూడా ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తెలుగులో కూడా త్వరలోనే విడుదల కానుంది దురంధర్ సినిమా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు డాన్స్ కొరియోగ్రఫీ అందించిన విజయ్ గంగూలీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
Anaswara Rajan: క్యూట్ స్మైల్ తో కవ్విస్తున్న లేటెస్ట్ బ్యూటీ.. అనశ్వర రాజన్ ఫోటోస్
దురంధర్(Dhurandhar) సినిమాలో శరరత్ అనే స్పెషల్ ఉంది. ఈ సాంగ్ మంచి విజయాన్ని సాధించింది. ఈ పాటకు విజయ్ గంగూలీ డాన్స్ కంపోజ్ చేశాడు. అయితే ముందుగా ఈ పాటను తమన్నాతో చేద్దామని సలహా ఇచ్చాడట విజయ్ గంగూలీ. కానీ, దానికి దర్శకుడు ఆదిత్య ధర్ ఒప్పుకోలేదట. దానికి కారణం ఏంటంటే, “ఒకవేళ ఈ పాట తమన్నా చేస్తే ఆడియన్స్ కేవలం ఒక ‘స్పెషల్ ఐటమ్ సాంగ్’లా చూస్తారు. దానిని కథలో భాగంగా చూడలేరు. తమన్నా స్క్రీన్ మీద కనిపిస్తే అందరి దృష్టి ఆమె డ్యాన్స్ పైకి వెళ్తుంది. కాబట్టి, ఆడియన్స్ కథ నుంచి డిస్కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందని”వివరించాడట. ఆ మాటలు విని తాను నిజంగా ఆశ్చర్యపోయాను అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ గంగూలీ. దీంతో ఈ డాన్స్ మాస్టర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
