Star Heroines : ఓటీటీ కోసం బోల్డ్ సీన్స్ కి రెడీ అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఇన్నేళ్ల కెరీర్ ని దాటి..
టాప్ హీరోయిన్స్ సైతం లిమిటేషన్స్ ను మించి అడల్ట్ కంటెంట్స్ కలిగిన మూవీస్ లోనూ, సిరీస్ లోనూ నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో తమన్నా నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ 'జీ కర్దా' రిలీజయింది.

Tamannaah Samantha Rakul Preet and so many heroines doing bold contents for OTT
Tamannaah : కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ వాళ్ళు అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇంత వరకూ ఇన్ని సంవత్సరాలు గ్లామరస్ తో పాటు ఎమోషనల్, లవ్.. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ను ఎంతగానో ఇంప్రెస్ చేసిన ఆ ముద్దుగుమ్మలు ఇప్పుడు డిజిటల్ జెర్నీలో తమలోని న్యూ యాంగిల్ ను బైట పెడుతున్నారు. ఓటీటీ కంటెంట్ (OTT Content) కోసం బోల్డ్ గా తమ బ్యూటీని ఎలివేట్ చేస్తున్నారు.
సినిమాల్లోని గ్లామర్ రోల్స్ కు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే హీరోయిన్స్ పర్ఫార్మ్ చేస్తారు. అయితే ఓటీటీ సెన్సార్ లేకపోవడం వల్ల గ్లామర్ అనేది ఇప్పుడు బోల్డ్ నెస్ గా మారిపోయింది. ఇప్పటికే ఓటీటీలలో మోతాదుకు మించి బోల్డ్ కంటెంట్, శృంగారం, బూతులు చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకి హీరోయిన్స్ కూడా వెళ్తున్నారు. ఇన్నాళ్లు స్టార్ హీరోయిన్స్ గా చేసిన వాళ్ళు సైతం ఇప్పుడు ఓటీటీల కోసం బోల్డ్ కంటెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
టాప్ హీరోయిన్స్ సైతం లిమిటేషన్స్ ను మించి అడల్ట్ కంటెంట్స్ కలిగిన మూవీస్ లోనూ, సిరీస్ లోనూ నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో తమన్నా నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘జీ కర్దా’ రిలీజయింది. అరుణిమ శర్మ ఈ వెబ్ సిరీస్ కి డైరెక్టర్. ఓటీటీలో వచ్చే వెబ్ సిరిస్ లు అంటేనే బోల్డ్ సీన్స్ ఉంటాయి అని అందరికీ తెలుసు. అయితే తమన్నా నటించడంతో చాలా మంది ఈ వెబ్ సిరీస్ ని చూడటానికి ఉత్సాహం చూపించారు. ఇందులో ఆమె చాలా బోల్డ్ సీన్స్ లో నటించడం విశేషం. పెళ్లికి ముందే లివ్ ఇన్ రిలేషన్ లో ఉండటం వారి మధ్య ఇంటిమసీ సీన్స్ చాలానే ఉన్నాయి. ఆమెను అంత బోల్డ్ గా చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.
ఇక తమన్నా నటించిన మరో అడల్ట్ కంటెట్ డిజిటల్ మూవీ లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2). నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ లోనూ తమన్నా బోల్డ్ గా నటించింది. తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి బోలెడన్ని బోల్డ్ సీన్స్ లో నటించినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు లస్ట్ స్టోరీస్ ఫస్ట్ పార్ట్ లో కియారా అద్వానీ లాంటి హీరోయిన్స్ సైతం చాలా బోల్డ్ గా నటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు లస్ట్ స్టోరీస్ 2 తమ్మూ ఎంట్రీతో మరింత స్పెషల్ గా మారింది. ఇక ఈ సిరీస్ లో మృణాల్ ఠాకూర్, సీనియర్ నటి కాజోల్ కూడా తమలోని బోల్డ్ నెస్ ని బయట పెట్టనున్నారు.
సమంత ప్రజెంట్ తెలుగు సినిమాల కంటే బాలీవుడ్ సినిమాల మీదనే ఫోకస్ ఎక్కువగా పెట్టింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ ను సంపాదించుకున్న సామ్ ప్రస్తుతం సిటాడెల్ ఇండియా వెర్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు డైరెక్టర్స్. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే గ్లోబల్ స్టార్ ప్రియాంక చెప్రా నటించిన సిటాడెల్ ఒరిజినల్ వెర్షన్ లో ప్రియాంకా బోల్డ్ సీన్స్ ను బాగానే చూపించారు. ఇండియన్ వెర్షన్లో కూడా ఈ ఇంటిమేటెడ్ సీన్స్ ఉండనున్నాయని టాక్ నడుస్తోంది. వరుణ్ తో సామ్ లిప్‌లాక్ లు, రొమాంటిక్ సీన్స్ హైలో ఉండనున్నాయట. మరి ఈ వెబ్ సిరీస్ లో సమంత పాత్రను ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో చూడాలి.
Also Read: ‘గుంటూరు కారం’ సంక్రాంతికి రాదా? మళ్ళీ షూటింగ్ వాయిదా..
కాజల్ కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఒక బోల్డ్ పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికన్ టివి సిరిస్ ‘క్వాంటికో’ ను త్వరలోనే రీమేక్ చేయబోతున్నారు. అయితే ఆ సిరీస్ లోని బోల్డ్ సీన్స్ లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గతంలోనే చాలా వార్తలు వచ్చాయి. అందులో ప్రియాంక చోప్రా చేసిన పాత్రల్లోనే కాజల్ నటించనున్నట్లు టాక్. నెట్ ఫ్లిక్స్ నిర్మించనున్న ఆ సిరీస్ కోసం చందమామ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి కాజల్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేస్తుందా లేదా చూడాలి.
Hans Zimmer : లైవ్ కన్సర్ట్‌లో గాళ్ ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసిన ఆస్కార్ విజేత .. ఎవరంటే?
మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ హిందీ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించబోతున్నట్టు టాక్. ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ ఫేమ్ కాశ్వీ నాయర్ దర్శకత్వంలో మెదలైన ఈ వెబ్ సిరీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా యాక్షన్ రోల్ చేస్తుండటం విశేషం. ఈ వెబ్ సిరీస్ లో రకుల్ ప్రీత్ ఫుల్ బోల్డ్ సీన్స్ చూపిస్తుందట. ఇప్పటికే పలు ఓటీటీల్లో అనేకమంది బాలీవుడ్ హీరోయిన్స్ బోల్డ్ క్యారెక్టర్స్ లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు. ఇప్పుడు సౌత్ లో సక్సెస్ అయిన హీరోయిన్స్ కూడా బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ ఇలాంటి బోల్డ్ సిరీస్ లు చేస్తున్నారు. అయితే వీటికి రెమ్యునరేషన్ కూడా ఎక్కువే తీసుకుంటున్నారు ఈ భామలు. ఓటీటీకి కూడా సెన్సార్ వస్తే వీళ్లందరి పరిస్థితి ఏంటో?