Tamannaah: అమ్మబాబోయ్.. మగాడిగా మారిపోయిన మిల్కీ బ్యూటీ!

టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో తమన్నా పర్ఫార్మెన్స్‌కు ఆమె అభిమానులతో....

Tamannaah: అమ్మబాబోయ్.. మగాడిగా మారిపోయిన మిల్కీ బ్యూటీ!

Tamannaah Turns Man For Insta Reels

Updated On : May 31, 2022 / 9:34 PM IST

Tamannaah: టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో తమన్నా పర్ఫార్మెన్స్‌కు ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఎఫ్2 సినిమాతో పోలిస్తే, ఈ సినిమాలో తమన్నా వైవిధ్యంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. ఈ సినిమా చూసినవారికి ఆమె ఊహించని షాక్ ఇచ్చింది. అయితే తాజాగా తన ఇన్‌స్టా రీల్స్‌లో తమన్నా ఎవరూ ఊహించని విధంగా ఉన్నపలంగా మగాడిలా మారిపోయింది.

Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!

దీంతో ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. చీరకట్టులో అందాల ఆరబోతతో ఊరిస్తూ తలుపు చాటుకు వెళ్లిన తమన్నా, ఒక్కసారిగా మగాడిలా మారి ముందుకు రావడంతో అభిమానులు అవాక్కవుతున్నారు. అయితే ఈ గెటప్ ఆమె చేసిన ఎఫ్3 సినిమాలోని పాత్రకు సంబంధించి కావడం విశేషం. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్3 సినిమా కథలో భాగంగా తమన్నా మగాడి గెటప్‌లో కనిపిస్తుంది. అంతేగాక, ఈ సినిమాలో ఆమెకు ఓ ప్రేయసి ఉంటుందని.. వారిద్దరి మధ్య ఓ డ్యుయెట్ సాంగ్ కూడా ఉందని సినిమా చూసిన వారు చెబుతున్నారు.

Tamannaah: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తమన్నా కొత్త మూవీ

ఏదేమైనా ఇలా ఇన్‌స్టా రీల్స్‌లో అందాల తమన్నా ఒక్కసారిగా మగాడిలా మారిపోవడంతో అవాక్కయిన అభిమానులు, ఆ తరువాత అది సినిమాలోని వేషం అని తెలుసుకుని తేరుకుంటున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం ఎఫ్3 సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. అంతేగాక, ఇటీవల కాన్స్-2022 ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై తన అందాలను ప్రదర్శించి యావత్ ప్రపంచదృష్టిని తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)