గోపిచంద్‌తో తమన్నా
రూ. 32 కోట్ల భారీ బడ్జెట్‌తో గోపిచంద్ కొత్త సినిమా.

రూ. 32 కోట్ల భారీ బడ్జెట్‌తో గోపిచంద్ కొత్త సినిమా.
గోపిచంద్ హీరోగా తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం, ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో గల జైసల్మేర్ దగ్గర జరుగుతుంది. దాదాపు రూ. 32 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. గోపీచంద్‌కి జోడీగా మిల్కీబ్యూటీ తమన్నాని నటింపచెయ్యడానికి చిత్రబృందం సంప్రదింపులు జరుపుతుంది.
ఇదే నిజమైతే తమన్నా, గోపీచంద్ కలిసి నటించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌కి కూడా అవకాశం ఉందనీ, ఆ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటి జరీన్ ఖాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి మాటలు : అబ్బూరి రవి, ఫైట్స్ : సెల్వ.