SR Prabhakaran : తెలుగు నిర్మాతల నిర్ణయాన్ని మెచ్చుకున్న తమిళ డైరెక్టర్.. తమిళ్ లో కూడా అలాగే చేయాలి..

ఈ సందర్భంలో ప్రభాకరన్ తెలుగు నిర్మాతలు ఇటీవల షూటింగ్స్ ఆపేసి సినీ సమస్యలపై తీసుకున్న నిర్ణయాలని అభినందించారు. ప్రభాకరన్ మాట్లాడుతూ.. ''తెలుగులో కూడా సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నాను. సినిమాలు ఓటీటీలో విడుదల చేయడం కేవలం...............

SR Prabhakaran :  సుందర పాండియన్‌ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు ఎస్‌ఆర్‌ ప్రభాకరన్‌. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో డైరెక్టర్ గా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకి ఇటీవల ఉత్తమ కథా రచయితగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును గెలుచుకున్న సందర్భంగా దర్శకుడు ఎస్‌ఆర్‌ ప్రభాకరన్‌ తమిళ మీడియాతో మాట్లాడారు.

Natti Kumar : ధనుష్ 3 సినిమా రీరిలీజ్.. నిర్మాతల నిర్ణయాలపై.. నిర్మాత నట్టి కుమార్ కామెంట్స్..

ఈ సందర్భంలో ప్రభాకరన్ తెలుగు నిర్మాతలు ఇటీవల షూటింగ్స్ ఆపేసి సినీ సమస్యలపై తీసుకున్న నిర్ణయాలని అభినందించారు. ప్రభాకరన్ మాట్లాడుతూ.. ”తెలుగులో కూడా సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నాను. సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయడం కేవలం డబ్బుల కోసమే. ఇటీవల తెలుగు నిర్మాతలు సినీ సమస్యలకి పరిష్కారాలు చూపించారు. సినిమాలని చాలా ఆలస్యంగా ఓటీటీలో విడుదల చేయాలనేది మంచి నిర్ణయం. ఇక నటీనటులు వాళ్ళ అసిస్టెంట్స్ వేతనాలను వాళ్లే చెల్లించుకోవాలని తెలుగు నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఆ నిర్ణయాన్ని తమిళ్ లో కూడా అమలు పరచడానికి తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకోవాలి” అని అన్నారు. దీంతో ప్రభాకరన్ చేసిన వ్యాఖ్యలు తమిళ సినీ పరిశ్రమలో చర్చగా మారాయి.

ట్రెండింగ్ వార్తలు