Natti Kumar : ధనుష్ 3 సినిమా రీరిలీజ్.. నిర్మాతల నిర్ణయాలపై.. నిర్మాత నట్టి కుమార్ కామెంట్స్..

నట్టి కుమార్ ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ''30 ఏళ్ళకు పైగా సినీ పరిశ్రమలోనే ఉన్నాను, ఇతర వ్యాపార రంగాల్లోకి ప్రవేశిస్తున్నా సినిమా రంగాన్ని వదిలిపెట్టను. ఇటీవ‌ల కొంద‌రు నిర్మాత‌లు ఏకాభిప్రాయంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని...........

Natti Kumar : ధనుష్ 3 సినిమా రీరిలీజ్.. నిర్మాతల నిర్ణయాలపై.. నిర్మాత నట్టి కుమార్ కామెంట్స్..

Natti Kumar comments on dhanush 3 movie Re Release

Natti Kumar :  ఇటీవల పాత సినిమాలు మళ్ళీ రీరిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. ఇప్పటికే మహేష్, పవన్ కళ్యాణ్ సినిమాలు రీరిలీజ్ అవ్వగా ప్రభాస్, చిరంజీవి సినిమాలు రీరిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళ హీరో ధనుష్ నటించిన 3 సినిమా మళ్ళీ రిలీజ్ కానుంది. ఈ సినిమా మ్యూజికల్ గా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పటికి ఈ సినిమాకి అభిమానులు ఉన్నారు. తెలుగులో కూడా ధనుష్ కి మంచి మార్కెట్ ఉండటంతో 3 సినిమాని మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు.

ధనుష్ 3 సినిమాని నిర్మాత నట్టి కుమార్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా నిర్మాతలపై, ఫిలిం ఛాంబర్ పై, ఆర్జీవిపై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన చిన్న సినిమాల నిర్మాత నట్టికుమార్ తాజాగా ఓ ప్రెస్ మీట్ పెట్టి 3 సినిమాని రీరిలీజ్ చేస్తున్నట్టు తెలిపి, ఫిలిం ఛాంబర్ పై, నిర్మాతలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

నట్టి కుమార్ ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ”30 ఏళ్ళకు పైగా సినీ పరిశ్రమలోనే ఉన్నాను, ఇతర వ్యాపార రంగాల్లోకి ప్రవేశిస్తున్నా సినిమా రంగాన్ని వదిలిపెట్టను. ఇటీవ‌ల కొంద‌రు నిర్మాత‌లు ఏకాభిప్రాయంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని, త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు బంద్‌కు పిలుపునిచ్చారు. అది కరెక్ట్ కాదు. దీనివల్ల చిన్న నిర్మాతలు, కార్మికులు చాలా నష్టపోయారు. అసలు ఈ బంద్ ఎందుకు చేశారో ఎవ్వరికీ అర్ధం కాలేదు. థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రాక‌పోవ‌డం అనేది ఉండదు, టిక్కెట్ల రేట్లు తగ్గించి. మంచి కంటెంట్ సినిమాలు ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇటీవల పాత సినిమాల‌ను కూడా ఆదరించారు. ఒకప్పటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు రీరిలీజ్ అయి కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. వచ్చేసారి ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను” అని అన్నారు.

Amitabh Bachchan: మన ఇద్దరి స్థితి ఒకటే అంటూ.. సామాన్యుడితో పోలుచుకున్న అమితాబ్ బచ్చన్!

ఇక ధనుష్ 3 సినిమా రీరిలీజ్ గురించి మాట్లాడుతూ.. ”ఇటీవ‌ల రీరిలీజ్ అయి మళ్ళీ ఘ‌న‌విజ‌యం సాధించిన సినిమాలన్నీ కంటెంట్‌ను న‌మ్ముకుని హిట్ సాధించిన‌వే. నేను కూడా అదే న‌మ్మ‌కంతో గ‌తంలో విడుద‌లై ఓ మోస్త‌రు విజ‌యం సొంతం చేసుకున్న ధ‌నుష్‌, శృతిహాస‌న్ న‌టించిన 3 సినిమాని అప్ప‌ట్లో మేమే విడుద‌ల చేశాము. ఇప్పుడు అదే సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల‌లో మళ్ళీ విడుదల చేస్తున్నాం. ఒక్క తెలంగాణలోనే ఇప్పటికే దాదాపు 75కు పైగా థియేట‌ర్ల‌లో వేస్తున్నాం. చాలా షోస్ ఆన్లైన్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి ఇప్పటికే. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా రిలీజ్ చేయబోతున్నాం. పదేళ్ల తర్వాత కూడా 3 సినిమాకి ఇంత క్రేజ్ వస్తుందని మేము ఊహించలేదు. మంచి కంటెంట్ ఉంటే సినిమాని ప్రేక్షకులు ఎప్పటికైనా ఆదరిస్తారని మరోసారి రుజువైంది. నిర్మాత‌లు, హీరోలు అంద‌రూ కంటెంట్‌ను న‌మ్ముకుని సినిమాలు తీయాల‌ని నా అభిప్రాయం” అని తెలిపారు.