Tamil Movies : ఆ 5గురు హీరోలపై తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సీరియస్ యాక్షన్.. ఇకపై వాళ్ళతో సినిమాలు..

పలువురు హీరోలు, నటులు ప్రొడ్యూసర్స్ నుంచి డబ్బులు తీసుకొని డేట్స్ ఇవ్వట్లేదని పలువురు నిర్మాతలు తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.

Tamil Movies : ఆ 5గురు హీరోలపై తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సీరియస్ యాక్షన్.. ఇకపై వాళ్ళతో సినిమాలు..

Tamil Film Producer Council wants to take serious action on five actors news goes viral

Updated On : June 19, 2023 / 2:27 PM IST

TFPC :  తమిళ్ సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు వివాదాలు జరుగుతూ ఉంటాయి. పలువురు నటులు నిర్మాతలు ఇబ్బంది పెడుతున్నారని ఎక్కువగా ఫిర్యాదులు వస్తాయి తమిళ సినీ పరిశ్రమ నుంచి. తాజాగా అలాంటి వివాదమే ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో నడుస్తుంది. పలువురు హీరోలు, నటులు ప్రొడ్యూసర్స్ నుంచి డబ్బులు తీసుకొని డేట్స్ ఇవ్వట్లేదని పలువురు నిర్మాతలు తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.

ఇందులో పలువురు గతంలో కూడా ఇలా చేసిన దాఖలాలు ఉన్నాయని తమిళ నిర్మాతల సంఘం వీరిపై సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. ప్రస్తుతం వారితో చర్చించి, వారి సమాధానం బట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో నిర్ణయించనున్నారు. అలాగే అప్పటివరకు వారితో సినిమాలు తీయాలంటే ముందుగా మమ్మల్ని సంప్రదించాలని తమిళ నిర్మాతల మండలి పేర్కొంది.

The Archies : షారుఖ్ ఖాన్ కూతురి ఫస్ట్ సినిమా.. ‘ది ఆర్చీస్’ టీజర్ రిలీజ్.. సుహానాతో పాటు ఖుషి కపూర్ కూడా..

అయితే ఆ అయిదుగురు నటులు ఎవరన్నది తమిళ నిర్మాతల మండలి అధికారికంగా ప్రకటించలేదు. వారితో చర్చల అనంతరం అధికారికంగా ఆ నటుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. కానీ తమిళ సినీ పరిశ్రమలో నడుస్తున్న టాక్ ప్రకారం ఆ అయిదుగురు నటులు హీరో విశాల్, శింబు, SJ సూర్య, అథర్వ, యోగిబాబు అని సమాచారం. మరి ఈ తమిళ యాక్టర్స్ పై తమిళ నిర్మాతల మండలి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. దీనిపై ఆ నటులెవ్వరు ప్రస్తుతం స్పందించలేదు.