Simbu : ఆసుపత్రి పాలైన స్టార్ హీరో తండ్రి.. చికిత్స కోసం విదేశాలకు..

కోలీవుడ్‌ స్టార్‌ శింబు తండ్రి, నటుడు, దర్శకుడు టి.రాజేందర్‌ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. మే 7న ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించి............................

Simbu : ఆసుపత్రి పాలైన స్టార్ హీరో తండ్రి.. చికిత్స కోసం విదేశాలకు..

Simbu

Updated On : May 25, 2022 / 7:13 AM IST

Rajendar :  కోలీవుడ్‌ స్టార్‌ శింబు తండ్రి, నటుడు, దర్శకుడు టి.రాజేందర్‌ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. మే 7న ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాజాగా ఈ విషయం బయటకి రావడంతో ఆయనపై తమిళ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. దీంతో శింబు తన తండ్రి ఆరోగ్యంపై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ లేఖ విడుదల చేశాడు.

Bindu Madhavi : బిగ్‌బాస్‌ విన్నర్ బిందు మాధవి షో నుంచి ఎంత సంపాదించిందో తెలుసా??

ఈ లేఖలో.. ”మా తండ్రికి ఛాతీలో నొప్పి రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాము. పొత్తికడుపులో రక్తస్రావం అవుతుండటంతో ఆయనకు ఇంకా మెరుగైన వైద్యం అవసరమని డాక్టర్లు చెప్పడంతో వారి సూచనల మేరకు ఆయనని విదేశాలకు తీసుకెళ్ళాం. ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆయన బాగానే ఉన్నారు, ఎలాంటి కంగారు అవసరం లేదు. ట్రీట్‌మెంట్‌ పూర్తవగానే తిరిగొస్తాం. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు” అని శింబు తెలిపాడు.