Lok Sabha Elections 2024 : తమిళనాట ఓటు వేయడానికి క్యూ కట్టిన సినిమా స్టార్లు.. రజిని, కమల్, విజయ్, అజిత్..లతో సహా అందరూ..

తమిళనాడులో కూడా ఇవాళే లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తమిళనాట సినిమా స్టార్స్ అంతా ఓటు వేయడానికి క్యూ కట్టారు.

Lok Sabha Elections 2024 : తమిళనాట ఓటు వేయడానికి క్యూ కట్టిన సినిమా స్టార్లు.. రజిని, కమల్, విజయ్, అజిత్..లతో సహా అందరూ..

Tamil Movie Stars Cast Their Votes in Lok Sabha Elections 2024 Photos and Videos goes Viral

Updated On : April 19, 2024 / 12:00 PM IST

Lok Sabha Elections 2024 : దేశంలో ఎన్నికలు మొదలయ్యాయి. నేడు లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. నేడు మొత్తం 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. తమిళనాడులో కూడా ఇవాళే లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తమిళనాట సినిమా స్టార్స్ అంతా ఓటు వేయడానికి క్యూ కట్టారు.

Also Read : Rajamouli – Mahesh Babu : సినిమా అనౌన్స్ చేశాక మొదటిసారి కలిసి కనిపించిన రాజమౌళి మహేష్ బాబు.. మహేష్ లుక్ అదిరిందిగా..

ఇవాళ ఉదయం నుంచి కోలీవుడ్ సెలబ్రిటీలంతా పోలింగ్ బూత్ ల వద్దకు ఓటు వేయడానికి వస్తున్నారు. ఇప్పటికే రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, ధనుష్, త్రిష, విజయ్ సేతుపతి.. ఇలా అనేకమంది సినిమా స్టార్స్ వచ్చి ఓట్లు వేశారు. మరింతమంది సినీ ప్రముఖులు వారి ఓటు హక్కు వినియోగించుకోడానికి వస్తున్నారు. సినీ స్టార్స్ ఓట్ వేయడానికి రాగా పోలింగ్ బూత్ వద్ద నుంచి వస్తున్న వారి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓటు వేసిన అనంతరం సెలబ్రిటీలు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరారు.