Rajamouli – Mahesh Babu : సినిమా అనౌన్స్ చేశాక మొదటిసారి కలిసి కనిపించిన రాజమౌళి మహేష్ బాబు.. మహేష్ లుక్ అదిరిందిగా..

SSMB29 సినిమా అనౌన్స్ చేశాక తాజాగా మొదటిసారి రాజమౌళి - మహేష్ బాబు కలిసి కనిపించారు.

Rajamouli – Mahesh Babu : సినిమా అనౌన్స్ చేశాక మొదటిసారి కలిసి కనిపించిన రాజమౌళి మహేష్ బాబు.. మహేష్ లుక్ అదిరిందిగా..

Mahesh Babu And Rajamouli coming from Dubai First Combines Appearance after announce SSMB29 Movie

Updated On : April 19, 2024 / 11:35 AM IST

Rajamouli – Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. RRR సినిమా తర్వాత రాజమౌళి మహేష్ తో చేయబోతున్నట్టు తెలిపి SSMB29 సినిమాని ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో మొదటి సారి సినిమాని ప్రకటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక SSMB29 సినిమా గురించి రోజుకొక వార్త వినిపిస్తూనే ఉంది.

ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని, మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలయ్యాయని, మహేష్ బాబు స్పెషల్ ట్రైనింగ్స్ తీసుకుంటున్నాడని పలువురు చెప్తూ వచ్చారు. కానీ ఇప్పటిదాకా అధికారికంగా మహేష్ నుంచి కాని రాజమౌళి నుంచి కాని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా ప్రకటించినప్పుడు తప్ప అసలు వీళ్లిద్దరు మళ్ళీ కలిసి కనిపించలేదు కూడా. కనీసం సినిమా ఈవెంట్స్ లో కూడా ఎక్కడా వీళ్ళిద్దరూ కలిసి కనిపించలేదు కూడా.

Also Read : Tollywood Movies : బాలీవుడ్ టాప్ 10 థియేట్రికల్ రైట్స్ తెలుగు సినిమాలు ఇవే.. ఫస్ట్ ప్లేస్‌లో ‘పుష్ప 2’ మరి లాస్ట్ ఏంటి..?

సినిమా అనౌన్స్ చేశాక తాజాగా మొదటిసారి రాజమౌళి – మహేష్ బాబు కలిసి కనిపించారు. ఇటీవల మహేష్ ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుండి మహేష్ దుబాయ్ వెళ్ళాడు. రాజమౌళి కూడా దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ లో SSMB29 సినిమా గురించే డిస్కషన్స్ జరిగినట్టు, ఆ సినిమా పని మీదే వెళ్లినట్టు సమాచారం. నేడు ఉదయం రాజమౌళి – మహేష్ ఇద్దరూ కలిసి దుబాయ్ నుంచి వచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు కలిసి వస్తున్న విజువల్స్ వైరల్ గా మారాయి.

ఇంకేముంది వీరిద్దరి కాంబోలో సినిమా ప్రకటించాక మొదటిసారి రాజమౌళి – మహేష్ కలిసి కనిపించడంతో ఎయిర్ పోర్ట్ వీడియోలు వైరల్ అవ్వడమే కాక SSMB29 కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సినిమా వర్క్ మొదలుపెట్టేశారు, త్వరలోనే అప్డేట్ ఏమైనా ఇస్తారేమో అని అభిమానులు భావిస్తున్నారు. ఇక మహేష్ జుట్టు బాగా పెంచేసుకొని కనపడ్డాడు. దీంతో రాజమౌళి సినిమా కోసం మహేష్ జుట్టు పెంచుతున్నట్టు తెలుస్తుంది. ఈ లుక్ కూడా అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.