త్రిష దెబ్బకు నయనతారను ఆడుకుంటున్న నిర్మాతలు

కథానాయికల పారితోషికం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న తమిళ నిర్మాతలు..

  • Published By: sekhar ,Published On : March 7, 2020 / 02:29 PM IST
త్రిష దెబ్బకు నయనతారను ఆడుకుంటున్న నిర్మాతలు

Updated On : March 7, 2020 / 2:29 PM IST

కథానాయికల పారితోషికం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న తమిళ నిర్మాతలు..

పాపులర్ హీరోయిన్ త్రిష చేసిన పని లేడీ సూపర్ స్టార్ నయనతార కొంపముంచింది. సినిమా ప్రమోషన్లకు కథానాయికలు హాజరు కాకపోవడంతో వారి రెమ్యునరేషన్, వివిధ వసతుల విషయంలో తమిళ నిర్మాతల మండలి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిగా దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతారకు తమిళ నిర్మాతల మండలి భారీ షాక్ ఇచ్చేందకు రెడీ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. త్రిష నటించిన తమిళ చిత్రం ‘పరమపదం విలయాట్టు’  ప్రీ రిలీజ్ కార్యక్రమానికి త్రిష రాకపోవటంపై తమిళ సినీ నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది.

రెండు రోజుల్లో సినిమా ప్రమోషన్‌కు రాకపోతే త్రిష పారితోషికంలో సగం వెనక్కివ్వాలని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను బాగా సీరియస్‌గా తీసుకున్న నిర్మాతలు.. నయనతారతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. నయన్ మంచి నటి అనే విషయం పక్కన పెడితే తను యాక్ట్ చేసిన ఏ సినిమా ప్రమోషన్స్‌‌కూ ఆమె రాదు. అంతేకాదు తాను నటించే ప్రతి సినిమాకు తన పారితోషికంతో పాటు తన సిబ్బంది వేతనాలకు సంబంధించిన ఖర్చులన్ని నిర్మాతలు భరిస్తానంటేనే ఆమె సినిమాలు ఒప్పుకుంటుంది.

ఆమెకున్న డిమాండ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఎదురు మాట్లాడకుండా మౌనంగా భరిస్తూ వస్తున్నారు. ఐతే.. ప్రస్తుతం వేరే హీరోయిన్స్ రాకతో నయనతారకు డిమాండ్ తగ్గింది. దొరికిందే చాన్స్ అనుకుని నిర్మాతలు కూడా నయనతార గొంతెమ్మ కోరికలకు ఇకనుంచి స్వస్తి పలకాలనే నిర్ణయానికి వచ్చినట్టు కోలీవుడ్ సమాచారం. ఈ సందర్భంగా తమిళ నిర్మాతల మండలి సమావేశమై ఓ నిర్ణయం తీసుకున్నారట. ఇక మీదట నయనతారకు ఆమె పారితోషకాన్ని మించి ఒక్కనయాపైసా ఎక్కువ ఇచ్చేదే లేదనే నిర్ణయం తీసుకున్నారట.

ఇప్పటి నుంచి నయనతార పర్సనల్ ఖర్చులకు, నిర్మాతలకు ఎలాంటి సంబంధము ఉండదని చెబుతన్నారు. అవన్నీ నయనతారే చూసుకోవాలట. నయనతారను చూసి మిగతా హీరోయిన్స్ కూడా ఇదే బాటలో తమ సిబ్బంది ఖర్చులను నిర్మాతలపై రుద్దుతున్నారట. దీంతో కేవలం నయనతార మాత్రమే కాకుండా మిగతా హీరోయిన్స్‌కు ఇదే రూల్ వర్తించేలా రూల్స్ పాస్ చేయాలని కోలీవుడ్ నిర్మాతల మండలి నిర్ణయించిందనే వార్త బాగా వినిపిస్తోంది. ఈ విషయమై త్వరలో నిర్మాతల మండలి ఓ అధికారిక ప్రకటన చేయనుంది.