RC 16 Update : చరణ్ RC16 సినిమాకు తమిళ్ స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్.. చరణ్ సర్‌తో వర్క్ చేయడం కోసం ఎదురుచూస్తున్నా..

తాజాగా తమిళ్ స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ ఏగన్ ఏకాంబరం RC16 సినిమా గురించి స్పెషల్ పోస్ట్ చేసాడు.

RC 16 Update : చరణ్ RC16 సినిమాకు తమిళ్ స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్.. చరణ్ సర్‌తో వర్క్ చేయడం కోసం ఎదురుచూస్తున్నా..

Tamil star Costume Designer Aegan Ekambaram Working for Ram Charan RC 16 Movie Special Post goes Viral

Updated On : September 19, 2024 / 10:05 AM IST

RC 16 Update : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవ్వకముందే RC16 సినిమా వర్క్ మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. రూరల్ బ్యాక్ డ్రాప్ లో బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం చరణ్ ఈ సినిమాకు కావాల్సిన లుక్ కోసం కష్టపడుతున్నాడు. మరో పక్క బుచ్చిబాబు RC16 ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నారు.

ఇప్పటికే RC16 సినిమాకు మూడు సాంగ్స్ కంపోజ్ అయిపోయింది. సెట్ వర్క్ కూడా జరుగుతుంది. మరో పక్క చరణ్ లుక్ ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పుడు కాస్ట్యూమ్ వర్క్ జరుగుతుంది. తాజాగా తమిళ్ స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ ఏగన్ ఏకాంబరం RC16 సినిమా గురించి స్పెషల్ పోస్ట్ చేసాడు.

Also Read : Sharwanand : శర్వానంద్ తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన డైరెక్టర్.. సాయి ధరమ్ తేజ్ సినిమా ఆగిపోయిందా.. ?

డైరెక్టర్ బుచ్చిబాబుతో దిగిన ఫొటో షేర్ చేసి ఏగన్ ఏకాంబరం తన సోషల్ మీడియాలో.. నేను టాలీవుడ్ లో మొదటిసారి పనిచేయబోతున్నాను. ఈ ఛాన్స్ కోసం చాలా రోజులుగా ఎదురుచూడగా ఇప్పటికి నెరవేరింది. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు సాన గారికి ధన్యవాదాలు. రామ్ చరణ్ సర్ తో కలిసి పనిచేయడానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. తమిళ్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి నా జర్నీ మొదలైంది. తెలుగులో ట్రెడిషన్స్ ని ఈ సినిమాలో చూపించటానికి ప్రయత్నిస్తాను. RC16 ప్రాజెక్టులో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని తెలిపారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవ్వగా చరణ్ ఫ్యాన్స్ అల్ ది బెస్ట్ చెప్తున్నారు. తమిళ్ లో ఇటీవలే తంగలాన్ సినిమాతో మెప్పించారు ఏగన్ ఏకాంబరం.