Vijay : రాజకీయాలపై మొదటిసారి బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన తమిళ్ స్టార్ హీరో విజయ్.. టార్గెట్ 2026?

తాజాగా విజయ్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. విజయ్ అభిమానుల సంఘం తరపున ఇటీవల టెన్త్, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారిని తమిళనాడులో నియోజకవర్గానికి అయిదుగురి చొప్పున పిలిపించి వారికి విజయ్ తో సన్మానం చేయించి ఒక్కొక్కరికి అయిదువేల రూపాయలు బహుమతి అందించారు.

Vijay : రాజకీయాలపై మొదటిసారి బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన తమిళ్ స్టార్ హీరో విజయ్.. టార్గెట్ 2026?

Tamil star hero thalapathy vijay comments on politics in a students event goes viral

Thalapathi Vijay : తమిళ్ లో స్టార్ హీరో విజయ్ కి ఫాలోయింగ్ చాలా ఎక్కువే. తమిళ్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. విజయ్ సినిమా వస్తుందంటే హంగామా మాములుగా అందదు. థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ అవుతాయి. థియేటర్ బయట సందడిగా ఉంటుంది. ఇక విజయ్ అభిమానులతో కూడా క్లోజ్ గా మూవీ అవుతారు. అభిమాన సంఘాలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.

అయితే విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఎప్పుడో విజయ్ మక్కల్ ఇయక్కం అనే పార్టీని స్థాపించారు. విజయ్ తండ్రి ఈ పార్టీని రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. పలువురు విజయ్ ఫ్యాన్స్ తమిళనాడులో లోకల్ ఎన్నికల్లో ఈ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు కూడా. అయితే ఇన్నాళ్లు విజయ్ ఈ పార్టీకి సంబంధం లేనట్టే, అంటి ముట్టనట్టే ఉంటున్నారు. తాజాగా విజయ్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. విజయ్ అభిమానుల సంఘం తరపున ఇటీవల టెన్త్, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారిని తమిళనాడులో నియోజకవర్గానికి అయిదుగురి చొప్పున పిలిపించి వారికి విజయ్ తో సన్మానం చేయించి ఒక్కొక్కరికి అయిదువేల రూపాయలు బహుమతి అందించారు.

ఈ కార్యక్రమంలో విజయ్ దాదాపు 1000 మంది విద్యార్థులకు స్టేజిపై సన్మానం చేసి, బహుమతులని అందించారు. అంతేకాక వారందరికీ వాళ్ళకి నచ్చినట్టు ఫోటోలు దిగారు. దాదాపు స్టేజిపై 10 గంటలు నించొని ఉన్నారు. దీంతో ఈ కార్యక్రమం వైరల్ గా మారింది. ఈ ఈవెంట్ లో విజయ్ స్టూడెంట్స్ తో దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.

అయితే ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. రేపటి ఓటర్లు మీరే. మీరు భవిష్యత్తు నాయకులను ఎన్నుకుంటారు. ఓట్లను డబ్బులకు అమ్ముకొని మన చేత్తో మన కళ్ళనే పొడుచుకుంటున్నాము. ఒక రాజకీయ నాయకుడు ఒక ఓటుకు 1000 రూపాయలు ఇస్తే మహా అయితే నియోజకవర్గం మొత్తం పంచడానికి రఫ్ గా 15 కోట్లు అవుతుంది అనుకుందాం. 15 కోట్లు ఊరికే పంచిపెడుతున్నాడంటే ఆ వ్యక్తి ఇంకెంత సంపాదించి ఉంటాడు పాలిటిక్స్ లో అని మీరు ఆలోచించాలి. డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలని మీ తల్లితండ్రులకు మీరే చెప్పాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో చర్చగా మారాయి.

Sitara : మరోసారి సారంగదరియా స్టెప్పులతో అదరగొట్టిన సితార.. మహేష్ కూతురా మజాకా..

మరోసారి విజయ్ రాజకీయాల్లోకి వస్తాడనే ఊహాగానాలు బలపడుతున్నాయి. 2026 లో పోటీ చేస్తాడేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విజయ్ డైరెక్ట్ గా పోటీ చేయకపోయినా తన పార్టీ తరపున అభిమానులని నిలబెట్టొచ్చని అంటున్నారు. ఇటీవల విజయ్ గతంలో కంటే ఎక్కువగా బయటకు రావడం, అభిమానులతో కలవడం చేస్తున్నారు. దీంతో రోజు రోజుకి విజయ్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు బలపడుతున్నాయి. తాజాగా ఈ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలతో మరోసారి విజయ్ తమిళ రాజకీయాల్లో చర్చగా మారాడు. మరి విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడో చూడాలి.