AVM Saravanan : సినీ పరిశ్రమలో విషాదం.. ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ అధినేత.. స్టార్ నిర్మాత కన్నుమూత..

ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ AVM ప్రొడక్షన్స్ అధినేత శరవణన్ మరణించారు. (AVM Saravanan)

AVM Saravanan : సినీ పరిశ్రమలో విషాదం.. ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ అధినేత.. స్టార్ నిర్మాత కన్నుమూత..

AVM Saravanan

Updated On : December 4, 2025 / 8:19 AM IST

AVM Saravanan : నేడు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ AVM ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత శరవణన్ మరణించారు. గత కొన్నాళ్లుగా వయోభారంతో, పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శరవణన్ నేడు తెల్లవారుజామున చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ 85 ఏళ్ళ వయసులో మరణించారు. దీంతో తమిళ, తెలుగు పరిశ్రమ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

దక్షిణ సినీ పరిశ్రమలోనే మొదటి, భారీ స్టూడియో, అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన AVM స్టూడియోస్, AVM ప్రొడక్షన్స్ అధినేత AV మెయియప్ప చెట్టియార్ తనయుడే శరవణన్. తండ్రి బాటలోనే AVM సంస్థ బాధ్యతలు తీసుకొని నడిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా దాదాపు 200 సినిమాలు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ, సింహళ భాషల్లో నిర్మించారు.

Also Read : Samantha – Raj : నిశ్చితార్థం ఎప్పుడో జరిగిందా..? సమంత హింట్స్ ఇచ్చినా మనమే పట్టించుకోలేదు.. పాత ఫొటోల్లో వెడ్డింగ్ రింగ్..

తెలుగులో కూడా లీడర్, జెమిని, ఎవరైనా ఎపుడైనా, ఆ ఒక్కటి అడక్కు, బామ్మమాట బంగారు బాట.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఈయన నిర్మాణంలోనే తెరకెక్కాయి. తమిళ్ లో అయితే శివాజీ, మెరుపుకలలు, అయాన్.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. నిర్మాత శరవణన్ మరణంతో తమిళ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ సినీ పరిశ్రమ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.