Tamilisai Soundararajan : బాలకృష్ణపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పొగడ్తలు.. తెలుగు సూపర్ స్టార్ అంటూ..

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా నిన్నటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిధిగా వచ్చారు. ఆమెకు బాలకృష్ణ స్వాగతం పలికి తీసుకువెళ్లారు.

Tamilisai Soundararajan : బాలకృష్ణపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పొగడ్తలు.. తెలుగు సూపర్ స్టార్ అంటూ..

Tamilisai Soundararajan Special Tweet on Nandamuri Balakrishna Photos goes Viral

Updated On : June 13, 2024 / 9:55 AM IST

Tamilisai Soundararajan – Balakrishna : నిన్న ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం గన్నవరంలో ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు విచ్చేసిన అతిధులను దగ్గరుండి స్వాగతం చెప్పి ప్రమాణ స్వీకారం సభ వద్దకు తీసుకువచ్చారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Also Read : NTR : మెగా – నందమూరి ఫ్యామిలీలు అంతా గన్నవరం వెళ్తే.. ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్‌కు..

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా నిన్నటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిధిగా వచ్చారు. ఆమెకు బాలకృష్ణ స్వాగతం పలికి తీసుకువెళ్లారు. బాలకృష్ణతో తమిళిసై సౌందర్ రాజన్ కాసేపు ముచ్చటించారు. కార్యక్రమం అయిన తర్వాత తమిళిసై సౌందర్ రాజన్ బాలకృష్ణతో ఉన్న ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. లెజెండరీ యాక్టర్, మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు, తెలుగు సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణను కలవడం ఆనందంగా ఉంది. సినిమా కెరీర్ కంటే కూడా ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఆయన చేసే గొప్ప సేవలు నేను గమనించాను అంటూ బాలయ్యని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారగా బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ తమిళిసై సౌందర్ రాజన్ ని అభినందిస్తున్నారు.