Tanushree Dutta : నాకేమన్నా అయితే నానా పటేకర్‌, బాలీవుడ్‌ మాఫియానే కారణం

తాజాగా తనుశ్రీ సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ పెట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ''నాకేమన్నా అయితే అందుకు నానా పటేకర్‌, అతడి బాలీవుడ్‌ మాఫియా ఫ్రెండ్సే కారణం. బాలీవుడ్‌ మాఫియా అంటే ఎవరెవరా అనుకుంటున్నారా?

Tanushree Dutta : నాకేమన్నా అయితే నానా పటేకర్‌, బాలీవుడ్‌ మాఫియానే కారణం

Tanushree Dutta

Updated On : July 30, 2022 / 8:34 AM IST

TanuShree :  బాలీవుడ్‌ నటి, ఒకప్పటి హీరోయిన్‌ తనుశ్రీ దత్తా గతంలో ‘మీ టూ’ ఉద్యమం పేరుతో బాగా పాపులర్ అయింది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ తనని శారీరంగా వేధించాడంటూ, చాలా మంది సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వాడుకుంటారని సంచలన ఆరోపణలు చేసింది. తనుశ్రీ చేసిన మీటూ ఉద్యమం దేశమంతా పాకి చాలా మంది ఇందులో పాల్గొన్నారు. చాలా మంది మహిళలు తమకి ఎదురైన అనుభవాలని షేర్ చేశారు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దీనిపై స్పందిస్తుంది.

Color Photo : సుహాస్ హీరోనా అంటూ చీప్ లుక్ ఇచ్చారు..

తాజాగా తనుశ్రీ సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ పెట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ”నాకేమన్నా అయితే అందుకు నానా పటేకర్‌, అతడి బాలీవుడ్‌ మాఫియా ఫ్రెండ్సే కారణం. బాలీవుడ్‌ మాఫియా అంటే ఎవరెవరా అనుకుంటున్నారా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించినప్పుడు ఎవరి పేర్లైతే వినిపించాయో వాళ్లంతా బాలీవుడ్‌ మాఫియాలో ఉన్నవారే. దయచేసి వారి సినిమాలు చూడకండి, వాళ్ళని బహిష్కరించండి. వాళ్ళకి సపోర్ట్ గా ఉండే మీడియా, పిఆర్ టీం నా గురించి బ్యాడ్ న్యూస్ ప్రచారం చేశారు. నా గురించి విషప్రచారం చేసినవారిని వదిలిపెట్టకండి. ఈ చట్టాలు, న్యాయాలు నా విషయంలో విఫలమయ్యాయి. అయినా ప్రజల మీద నాకు నమ్మకముంది. జైహింద్‌, బై..మళ్లీ కలుద్దాం” అని పోస్ట్ చేసింది. దీంతో తనుశ్రీ రాసిన పోస్ట్ మరోసారి బాలీవుడ్ లో వైరల్ గా మారింది.

Tanu