ప్రభాస్ అండ్ టీమ్ కరోనాను తట్టుకుని మరీ తిరిగొచ్చారు..
జార్జియా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చిన ప్రభాస్ 20 మూవీ టీమ్..

జార్జియా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చిన ప్రభాస్ 20 మూవీ టీమ్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్ స్టోరిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే విదేశాల్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాకు ‘జాన్’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇది ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా..
కరోనా ఎఫెక్ట్ తట్టుకుని మరీ చిత్ర బృందం జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకుని తాజాగా హైదరాబాద్ తిరిగొచ్చింది. టీమ్ ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్న ఫోటో షేర్ చేస్తూ.. ‘’జార్జియాలో మరో షెడ్యూల్ పూర్తయింది. ఎటువంటి అసౌకర్యం లేకుండా చిత్రీకరణ పూర్తి చేయడంలో మాకు సహాయ సహకరాలు అందించిన చిత్రబృందానికి కృతజ్ఞతలు. ముఖ్యంగా, ఫస్ట్ లుక్ త్వరలో విడుదల అవుతుంది’’ అని యువీ క్రియేషన్స్ తెలిపింది.
Read Also : టీవీ షోకి, కరోనాకు సంబంధం ఏంటి? నాకు సతీ సావిత్రి క్యారెక్టర్ ఇవ్వు..
ఇటీవల జార్జియా షెడ్యూల్‌కి సంబంధించి సూట్లో ప్రభాస్ స్కేట్ బోర్డుపై మూవ్ అవుతున్న స్మాల్ మేకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రభాస్ 21వ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్లో ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది.