Ahimsa Trailer: ‘అహింస’ ట్రైలర్.. తేజ డైరెక్షన్‌లో అభిరామ్ రెచ్చిపోయాడుగా!

టాలీవుడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అహింస’ ఎప్పుడో షూటింగ్ జరుపుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. కాగా, ఈ సినిమాతో దగ్గుబాటి ఫ్యామిల నుంచి మరొక హీరో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ ఈ సినిమాలో హీరోగా పరిచయం అవుతున్నాడు.

Ahimsa Trailer: ‘అహింస’ ట్రైలర్.. తేజ డైరెక్షన్‌లో అభిరామ్ రెచ్చిపోయాడుగా!

Teja Ahimsa Trailer Looks Impressive

Updated On : January 12, 2023 / 4:55 PM IST

Ahimsa Trailer: టాలీవుడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అహింస’ ఎప్పుడో షూటింగ్ జరుపుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. కాగా, ఈ సినిమాతో దగ్గుబాటి ఫ్యామిల నుంచి మరొక హీరో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ ఈ సినిమాలో హీరోగా పరిచయం అవుతున్నాడు.

Ahimsa Movie Teaser: ‘అహింస’ టీజర్ టాక్.. తేజ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా..?

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై మంచి వైబ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో అభిరామ్ లుక్ కూడా ప్రేక్షకులకు నచ్చడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, తాజాగా నేడు ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతులు మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తేజ మరోసారి తనకు కలిసొచ్చిన లవ్‌స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక పేదవాడైన హీరోకు ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి.. అతడు వాటిని ఎలా అధిగమిస్తాడు.. అతడికి ఈ క్రమంలో ఎవరు సాయం చేస్తారు అనే అంశాలతో ఈ సినిమా కథ ఉండబోతుంది.

ఈ సినిమాలో గీతిక హీరోయిన్‌గా నటిస్తోండగా, మరో హీరోయిన్ సదా ఈ సినిమాలో ఓ లాయర్ పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వనుంది. రజత్ బేడి, రవి కాలే, కమల్ కామరాజు తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈ సినిమాతో తేజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.