Hanuman Collections : అయ్యబాబోయ్.. అమెరికాలో ‘హనుమాన్’ కలెక్షన్స్ ఇంకా అదరగొడుతుందిగా.. ఇప్పట్లో ఆగేలా లేదు..

తెలుగు రాష్ట్రాల్లోనే కాక నార్త్, అమెరికాలో కూడా హనుమాన్ ఇంకా దూసుకుపోతుంది.

Hanuman Collections : అయ్యబాబోయ్.. అమెరికాలో ‘హనుమాన్’ కలెక్షన్స్ ఇంకా అదరగొడుతుందిగా.. ఇప్పట్లో ఆగేలా లేదు..

Teja Sajja Prashanth Varma Hanuman Movie Creates New Record in America

Updated On : January 28, 2024 / 2:10 PM IST

Hanuman Collections : ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా ఈ సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ సినిమా భారీ విజయం సాధించి ఇప్పటికే 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఇంకా దూసుకెళ్తుంది. సినిమా రిలీజయి 15 రోజులు అవుతున్నా థియేటర్స్ ఇంకా ఫుల్ అవుతున్నాయి. ఇప్పటికే గుంటూరు కారం కలెక్షన్స్ కూడా దాటేసి ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది హనుమాన్.

ఇటీవలే హనుమాన్ థ్యాంక్యూ మీట్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు మూవీ యూనిట్. తెలుగు రాష్ట్రాల్లోనే కాక నార్త్, అమెరికాలో కూడా హనుమాన్ ఇంకా దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే 150 కోట్ల గ్రాస్ రాగా నార్త్ లో 40 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఇక అమెరికాలో ఇటీవల 4.5 మిలియన్ డాలర్స్ వరకు కలెక్ట్ చేసి అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో టాప్ 5 సినిమాగా నిలిచి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది హనుమాన్. ఆ రికార్డ్ ని ఇంకా కొనసాగిస్తూ కలెక్షన్స్ పెంచుకుంటుంది.

Image

Also Read : SA Chandrasekhar : ‘లియో’ సెకండ్ హాఫ్ బాగోలేదంటే ఫోన్ కట్ చేశాడు.. లోకేష్ కనగరాజ్ పై విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు..

తాజాగా అమెరికాలో హనుమాన్ సినిమా 5 మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంటే మన కరెన్సీలో దాదాపు 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అది కూడా 15 రోజుల్లోనే. చాలా మంది స్టార్ హీరోల సినిమాలు అమెరికాలో లైఫ్ టైం వసూళ్లు కూడా ఇంత లేవు. బాహుబలి 2, RRR, సలార్, బాహుబలి 1 తర్వాత హనుమాన్ సినిమా నిలిచింది. మరి త్వరలోనే ఆ సినిమాల రికార్డులు కూడా బద్దలుకొడుతుందేమో అనిపిస్తుంది హనుమాన్ హవా చూస్తుంటే. ఫిబ్రవరి 9 వరకు పెద్ద సినిమాలు లేవు కాబట్టి హనుమాన్ హవా అప్పటిదాకా ఇంకా కొనసాగేలా ఉంది. త్వరలోనే 300 కోట్ల కలెక్షన్స్ అందుకుంటుందని చిత్రయూనిట్ భావిస్తున్నారు.