Josh Awards : సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యాక ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్..

జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డులు జనవరి 26 న హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరగబోతున్నాయి.

Josh Awards : సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యాక ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్..

Telangana Cinematography Minister Komatireddy Venkat Reddy Launch Josh South Indian Nandi Awards Poster

Updated On : December 29, 2023 / 5:19 PM IST

Josh South Indian Nandi Awards : ఇటీవలే తెలంగాణకు(Telangana) కొత్తమంత్రులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy)సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యాక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆయన్ను వెళ్లి కలిసి అభినందించారు. సినీ పరిశ్రమ గురించి మాట్లాడారు. తాజాగా మంత్రి అయ్యాక మొదటిసారి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఓ పోస్టర్ లాంచ్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

గత కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘జోష్’ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ పేరిట అవార్డులు ఇవ్వబోతున్నారు. జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డులు జనవరి 26 న హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాబోతున్నారు.

తాజాగా ఈ అవార్డ్స్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సౌత్ ఇండియా లెవెల్లో చేస్తున్న జోష్ నంది అవార్డ్స్ కార్యక్రమానికి మా ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా అండగా ఉంటాం. సౌత్ లో ఉన్న అన్ని రంగాలను కలుపుకొని ఈ కార్యక్రమం చేస్తున్న ‘జోష్’ నంది అవార్డ్స్ చెర్మన్ సంజోష్ తగరం గారికి శుభాకాంక్షలు అని తెలిపారు.

Telangana Cinematography Minister Komatireddy Venkat Reddy Launch Josh South Indian Nandi Awards Poster

Also Read : Vijay : విజయ్‌కాంత్‌కు నివాళులు అర్పించి వెళ్తుండగా.. తమిళ్ స్టార్ విజయ్‌పై చెప్పుతో దాడి..

ఇక ఈ కార్యక్రమంలో జోష్ నంది అవార్డ్స్ అధినేత సంజోష్ తగరం మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఎన్నో సినిమాలు వచ్చినా గత రాష్ట్ర ప్రభుత్వం నుండి కాని, ప్రైవేట్ గా కానీ ఏ ఒక్క నంది అవార్డు తెలుగు ఇండస్ట్రీకి ఇవ్వలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా సంస్థ నుండి రాష్ట్ర ప్రభూత్వం అనుమతితో, వారి సపోర్ట్ తీసుకొని ఈ నంది అవార్డ్స్ ఇస్తున్నాం. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటీనటులు, డైరెక్టర్స్ మరియు సాంకేతిక నిపుణులకు ఈ నంది అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అండగా ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రతేక్య కృఙ్ఞతలు అని తెలిపారు.