TFCC Election: నవంబరు 14న తెలంగాణ ఫిలిం చాంబర్ ఎన్నికలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదం ఇంకా ముగియలేదు. మా అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించినా.. ఎన్నికల నాటి వివాదం మాత్రం ఆగనేలేదు. కాగా, ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో..

Tfcc Election
TFCC Election: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదం ఇంకా ముగియలేదు. మా అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించినా.. ఎన్నికల నాటి వివాదం మాత్రం ఆగనేలేదు. కాగా, ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో ఎన్నికలకు సిద్ధం అయ్యారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. నవంబరు 14న ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా ప్రస్తుతం టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు.
MAA Election: ‘మా’ ఎన్నికలలో వైసీపీ.. ఇవిగో సాక్ష్యాలు!
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన రామకృష్ణ గౌడ్.. టీఎఫ్‌సీసీ స్థాపించి ఏడేళ్లు పూర్తయింది. మా చాంబర్‌లో 8000 మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 మంది తెలంగాణ మూవీ ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారని.. 30 మందితో కూడిన టీఎఫ్‌సీసీ ప్రస్తుత కమిటీ గడువు ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కాగా, ఇదే రోజునే ‘తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (T MAA’ ఎన్నికలు కూడా జరగనున్నాయి.
Maa Election: మోహన్ బాబుపై గొర్రెల పెంపకం దారుల ఫిర్యాదు!
టీఎఫ్‌సీసీ ప్రారంభమై ఏడేళ్లలో 8000 మంది సభ్యులుగా చేరడం సాధారణమైన విషయం కాదని.. ‘టీఎఫ్‌సీసీ’ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని.. టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడు ఎత్తరి గురురాజ్ తెలిపారు. ఈ ఎన్నికలలో సభ్యులలో ఆసక్తిగలవారు ఎవరైనా పోటీ చేయవచ్చని వీరు తెలిపారు.