Bigg Boss 7 : మళ్ళీ తిరిగొచ్చిన ఆ ముగ్గురు కంటెస్టెంట్స్.. బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ మాములుగా లేదుగా..

హౌస్ లో నుండి బయటకి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ ని మళ్ళీ లోపలి తీసుకు వచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన బిగ్ బాస్ ప్రోమోలో..

Bigg Boss 7 : మళ్ళీ తిరిగొచ్చిన ఆ ముగ్గురు కంటెస్టెంట్స్.. బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ మాములుగా లేదుగా..

Telugu Bigg Boss 7 latest promo eliminated contestants re entry

Updated On : October 15, 2023 / 10:32 AM IST

Bigg Boss 7 : తెలుగు బిగ్‌బాస్ ఏడో వారంలోకి అడుగు పెట్టబోతోంది. గత ఐదు వారాలుగా ఇంటిలో నుంచి ఆడవారే ఎలిమినేటి అవుతూ వచ్చారు. ఇక ఈ వీక్ ఎవరు ఎలిమినేటి అవుతారు అనేది అందరిలో ఆసక్తి నెలకుంది. ఇది ఇలా ఉంటే, బిగ్ బాస్ తాజాగా ఒక సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హౌస్ లో నుండి బయటకి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ ని మళ్ళీ లోపలి తీసుకు వచ్చారు. ఐదు వారాల్లో ర‌తిక రోజ్‌, ష‌కీలా, కిర‌ణ్ రాథోడ్‌, సింగ‌ర్ దామిని, శుభ శ్రీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ లో ముగ్గురు మళ్ళీ తిరిగి వచ్చారు.

తాజాగా రిలీజ్ చేసిన బిగ్ బాస్ ప్రోమోలో ఈ విషయాన్ని రివీల్ చేశారు. సింగ‌ర్ దామిని, ర‌తిక రోజ్‌, శుభ శ్రీ మళ్ళీ తిరిగి ఇంటిలోకి వచ్చారు. అయితే వీరు ఇంటిలోకి అతిథులుగా వచ్చారా..? లేదా కంటెస్టెంట్స్ గా వచ్చారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదే ప్రోమోలో.. ప్రిన్స్ యావర్ కి నాగ్ వార్నింగ్ ఇస్తున్న విషయాన్ని కూడా చూపించారు. ఇంటికి కెప్టెన్ అయిన వెంటనే.. యావర్ ప్రవర్తనలో మార్పు రావడం, హౌస్ లోని వారితో గొడవపడటం, ఇదే విషయాన్ని నాగ్ చూపించి వార్నింగ్ ఇవ్వడం ప్రోమోలో చూపించారు. మరి ఈ ఇంటరెస్టింగ్ ప్రోమోని మీరు కూడా చూసేయండి.

Also read : Gaanja Shankar : శంకర్ దాదా, గుడుంబా శంకర్ హోగయా.. ఈసారి గంజా శంకర్.. సాయి ధరమ్ కొత్త సినిమా గ్లింప్స్..

కాగా ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ప్రిన్స్ యావ‌ర్‌, అమ‌ర్‌దీప్‌, టేస్టీ తేజ‌లు సేఫ్ జోన్ లో ఉన్నార‌ట‌. అశ్విని, పూజా మూర్తిల‌కు ఓటింగ్ శాతం మంచిగానే ఉంద‌ని, న‌య‌ని పావ‌ని, శోభాశెట్టి మాత్రం ఆఖ‌రి రెండు స్థానాల్లో నిలిచి డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారని సమాచారం. అయితే పావని, శోభాశెట్టి ఇద్దరిలో.. శోభానే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మరి చూడాలి ఈ వారం ఏం జరుగుతుందో.