1134 Release Date : హీస్ట్ థ్రిల్లింగ్ మూవీ ‘1134’ రిలీజ్ డేట్ అనౌన్స్..
హీస్ట్ కథాంశంతో థ్రిల్లింగ్ స్టోరీతో వస్తున్న ‘1134’ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు.

telugu money heist thriller movie 1134 release date announced
1134 Release Date : హీస్ట్ కథాంశంతో ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియన్స్ వాటిని చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపద్యతంతోనే ‘1134’ అనే ప్రయోగాత్మక చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. కొత్త దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ ఇటీవల రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ ట్రైలర్ కి యూట్యూబ్ 1 లక్షకు పైగా వ్యూస్ సాధించింది.
శాన్వీ మీడియా, రాంధుని క్రియేషన్స్ బ్యానర్స్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 5న విడుదల చేయబోతున్నారు. శ్రీ మురళీ కార్తికేయ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. జితేందర్ తలకంటి, నజీబ్ షేక్ సినిమాటోగ్రాఫర్స్ గా చేస్తున్నారు. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని నిర్మాతలు పేర్కొన్నారు.
Also read : Jamal Kudu : ‘జమాల్ కుడు’ పాటకి.. బాలీవుడ్ ఇద్దరు మెగాస్టార్స్ స్టెప్పులు.. వీడియో వైరల్
ఇక ట్రైలర్ చూస్తే అర్ధమైన కథ ఏంటంటే.. ఒకరికి ఒకరు తెలియని ముగ్గురు వ్యక్తులు దొంగతనాలు చేయడానికి కలుస్తారు. ఆ తరువాత వారితో నాలుగో వ్యక్తి వచ్చి చేరిన తరువాత ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ట్రైలర్ లో చూపించిన విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.