హీరోలెవరూ ఖాళీ లేరు – షూటింగ్స్‌తో కళకళలాడుతున్న తెలుగు పరిశ్రమ
కంటిన్యూ షెడ్యూల్స్‌తో హీరోలందరూ బిజీ బిజీ.. రెగ్యులర్ షూటింగ్స్‌లో తెలుగు సినిమాలు..

కంటిన్యూ షెడ్యూల్స్‌తో హీరోలందరూ బిజీ బిజీ.. రెగ్యులర్ షూటింగ్స్‌లో తెలుగు సినిమాలు..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ఫిబ్రవరి 7నుంచి కోకాపేట్‌లో జరుగనుంది. ఫిబ్రవరి 18 నుంచి రాజమండ్రిలో ఓ షెడ్యుల్ ప్లాన్ చేశారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపొందనున్న హ్యాట్రిక్ ఫిలిం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 15నుంచి హైదరాబాద్‌లో జరుగనుంది.
కింగ్ అక్కినేని నాగార్జున, అహితోష్ సాల్మన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘Wild Dog’ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 5 నుంచి బ్యాంకాక్‌లో జరుగనుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘RRR’ సినిమా షూటింగ్ వికారాబాద్‌లో ఫారెస్ట్‌లో జరుగుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ఫిబ్రవరి 4నుంచి జరుగనుంది.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంది.
Read Also : ‘మైదాన్’ రిలీజ్ డేట్ మారింది..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో నటిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ‘RED’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.
యువసామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ‘Love Story’ సినిమా షూటింగ్ సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లో వేసిన సెట్‌లో జరుగుతుంది.
యంగ్ హీరో శర్వానంద్ కిశోర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ‘శ్రీకారం’ సినిమా షూటింగ్ హైదరబాద్ సారథి స్టూడియోలో జరుగుతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఏప్రిల్ 22న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘నాంది’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నరేష్ తొలిసారిగా సీరియస్ పాత్రలో కనిపించనున్నాడు.
విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మిస్తున్న ‘నారప్ప’ (అసురన్ రీమేక్) రెగ్యులర్ షూటింగ్ తమిళనాడు కురుమలైలో జరుగుతుంది. ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యాక విక్టరీ వెంకటేష్, చిత్ర బృందం అనంతపురంలో షెడ్యూల్ కంటిన్యూ చేస్తారు. వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
రవితేజ, గోపిచంద్ మలినేని ‘Krack’ సినిమా షూటింగ్ ఒంగోలులో జరుగుతుంది. రవితేజ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మే 8న ‘క్రాక్’ రిలీజ్ కానుంది.
మ్యాచో హీరో గోపీచంద్, సంపత్‌నంది కాంబినేషన్లో రూపొందుతున్న ‘సీటీమార్’ సినిమా షూటింగ్ యానాంలో జరుగుతుంది. ఈనెల 25వరకు ఈ షెడ్యుల్ ఉంటుంది.
గల్లా జయదేవ్ కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ శంషాబాద్ పద్మాలయా స్టూడియోలో జరుగుతోంది.
పిబ్రవరి 10నుంచి నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘టక్ జగదీష్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ పొలాచ్చిలో జరుగనుంది.
యంగ్ హీరో నితిన్, వెంకీ అట్లూరి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ‘Rang De’ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియో లో జరుగుతుంది.