Ashtadigbandhanam : అష్టదిగ్భంధనం మూవీ రివ్యూ.. ఇద్దరు వ్యక్తుల అహం వల్ల జరిగే కథ..
థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రీసెంట్ తెలుగు మూవీ ‘అష్టదిగ్భంధనం’. మరి ఈ మూవీ ప్రేక్షకులను..

telugu new movie Ashtadigbandhanam review
Ashtadigbandhanam : థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ట్విస్టులతో ఆసక్తికరంగా స్క్రీన్‌ప్లే నడిపిస్తే ఆడియన్స్ తప్పకుండా విజయాన్ని అందిస్తారు. ఈ ఫార్ములాను నమ్మి చేసిన సినిమానే ‘అష్టదిగ్భంధనం’. ‘ఎ గేమ్ విత్ క్రైమ్’ అనేది ట్యాగ్ లైన్. ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే క్రైమ్స్‌తో కూడిన ఒక గేమ్‌లా సినిమా ఉంటుంది. ‘సైదులు’ అనే సినిమాతో డైరెక్టర్‌గా మారిన బాబా పీఆర్ రెండో సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించాడు.
Manchu Lakshmi : ప్రధాని మోడీ ఆఫీస్ నుంచి మంచు లక్ష్మికి పిలుపు.. ఎందుకో తెలుసా..?
‘రచ్చ’ సినిమాలో జూనియర్ తమన్నాగా నటించిన విషిక కోట ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పలు లఘు చిత్రాలు, సినిమాల్లో నటించిన సూర్య భరత్ చంద్ర ‘అష్టదిగ్భంధనం’ సినిమాలో హీరోగా నటించాడు. నేడు సెప్టెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
కథ విషయానికి వస్తే.. శంకర్ అనే రౌడీ షీటర్.. తన తోటి రౌడీ షీటర్ రాజకీయ నాయకుడిగా మారి తననే అవమానిస్తుంటే ఇగో దెబ్బతిని తను కూడా ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలని నిర్ణయించుకుంటాడు. అధికార పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 50 కోట్లు చెల్లించేందుకు శంకర్ సిద్ధమవుతాడు. అందుకోసం పక్కా ప్లాన్ వేస్తాడు. రూ. 50 కోట్ల కోసం అతడు ఎలాంటి పథకం పన్నాడు? హీరోహీరోయిన్లు ఆ పథకంలో ఎలా ఇరుక్కున్నారు? రౌడీ షీటర్ శంకర్‌కు మంత్రి ఇచ్చిన వంద కోట్లు ఏమయ్యాయి? అసలు ఎవరు ఎవరికి స్కెచ్ వేశారు? చివరికి శంకర్ రాజకీయ నాయకుడు అయ్యాడా? హీరోహీరోయిన్స్ ఎలా బయటపడ్డారు అనేవి తెరపై చూడాల్సిందే.
Bedurulanka 2012 : ఓటీటీకి వచ్చేసిన బెదురులంక 2012.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
ఈ యుద్ధం రాజ్యం కోసమో, రాణి కోసమే జరిగేది కాదని.. ఇద్దరు వ్యక్తుల అహం వల్ల జరిగేదని ట్రైలర్‌లో చూపించారు. అది సినిమాలో పక్కాగా కనిపించింది. దర్శకుడు బాబా తనకు ఇది రెండో సినిమానే అయినా తన స్కీన్‌ప్లేతో మెప్పించాడు. ఫస్ట్ హాప్ అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని క్యారెక్టర్స్ గురించి సస్పెన్స్ క్రియేట్ చేసిన దర్శకుడు.. సెకెండాఫ్‌లో వాటికి కన్‌క్లూజన్ ఇచ్చాడు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ అయితే ఊహించలేని విధంగా ఉంటుంది. ఇక సెకెండాఫ్ అంతా ఏ క్షణం ఏం జరుగుతుందా అనే ఆసక్తితో నడిచిపోతుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకెండాఫ్‌లో దర్శకుడు ఎక్కువ ట్విస్టులను ప్లాన్ చేశాడు. ట్రైలర్ చూసి ఇదేదో క్రైమ్ కథో, లస్ట్ స్టోరీనో అనుకునేవాళ్లకు.. సినిమా చూస్తే ఆ అభిప్రాయం మారిపోతుంది. అక్కడక్కడ ఒకట్రెండు లాజిక్స్‌ను వదిలేస్తే ఓవరాల్‌గా సినిమా పర్వాలేదనిపిస్తుంది.
హీరోగా నటించిన సూర్య భరత్ చంద్ర తన నటనతో పర్వాలేదనిపించాడు. ఇక హీరోయిన్ విషిక తన అందచందాలతో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేయడమే కాకుండా తన నటనతో కూడా మెప్పించింది. రౌడీ షీటర్ శంకర్ పాత్ర చేసిన అతను విలనిజం బాగా పండించాడు. అలాగే మంత్రి పాత్ర చేసిన అతను కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. ఇక మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అందరూ కొత్తవాళ్లే అయినా దర్శకుడు వారి నుంచి తనకు కావాలనుకున్న నటన రప్పించుకున్నాడు. ఈ సినిమాకు రేటింగ్ 2.5 వరకు ఇవ్వొచ్చు. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు అష్టదిగ్భంధనం సినిమా చూస్తే కచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు.
గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే..