MixUp Review : బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ‘మిక్సప్’ మూవీ రివ్యూ.. ఆహా అనిపించిందా..!

ఆహా తీసుకు వచ్చిన ఈ బోల్డ్ కంటెంట్‌ మూవీ 'మిక్సప్' ఆడియన్స్ తో ఆహా అనిపించిందా..?

MixUp Review : బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ‘మిక్సప్’ మూవీ రివ్యూ.. ఆహా అనిపించిందా..!

Telugu OTT Aha Original MixUp movie review and rating

MixUp Review : ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ ఝవేరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బోల్డ్ కంటెంట్ మూవీ ‘మిక్సప్’. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఆకాష్ బిక్కి డైరెక్ట్ చేసిన ఈ చితం టీజర్ అండ్ ట్రైలర్స్ తో యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మరి ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం రివ్యూ ఏంటి..? ఆహా తీసుకు వచ్చిన ఈ బోల్డ్ కంటెంట్‌ ఆడియన్స్ తో ఆహా అనిపించిందా..?

కథ విషయానికొస్తే.. స్టోరీ లైన్ అంతా కొత్తగా పెళ్లి చేసుకున్న రెండు జంటల చుట్టూ తిరుగుతుంది. ఒక జంట అభయ్ (కమల్ కామరాజు), నిక్కీ (అక్షర గౌడ). మరో జంట సాహో (ఆదర్శ్ బాలకృష్ణ), మైథిలి (పూజ ఝవేరి). ఈ రెండు జంటలు సెక్సువల్ లైఫ్ దగ్గర విబేధాలు వచ్చి విడిపోదాం అనుకుంటారు. మొదటి జంటలో నిక్కీకి, రెండు జంటలో సాహోకి సెక్సువల్ లైఫ్ పై ఎక్కువ ఇంటరెస్ట్ ఉంటుంది.

అయితే వారి పార్ట్నర్స్ అయిన అభయ్, మైథిలి.. లస్ట్ కంటే ప్రేమ లైఫ్ ని కోరుకుంటూ ఉంటారు. దీంతో రెండు జంటల్లో విబేధాలు వస్తాయి. ఈ రెండు జంటలు విడిపోవడం కోసం నిర్ణయం తీసుకుంటే.. ఒక డాక్టర్ కౌన్సిలింగ్ ఇచ్చి కొన్ని రోజులు బయటకి వెళ్లి హ్యాపీ లైఫ్ ని స్పెండ్ చేయండి అని సలహా ఇస్తుంది. దీంతో రెండు జంటలు తమ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక రిసార్ట్ కి వస్తారు.

అక్కడ ఒకరికి ఒకరు పరిచయాలు అవుతాయి. ఏ పరిచయాలతో సెక్సువల్ లైఫ్ పై ఎక్కువ ఇంటరెస్ట్ ఉన్న సాహో, నిక్కీ ఒకరికి ఒకరు అట్రాక్ట్ అవుతారు. ఇక ఆ తరువాత నుంచి ఏమైంది..? రెండు జంటలు తమ తమ పార్ట్నర్స్ ని అర్ధం చేసుకొని, తమ మ్యారేజ్ లైఫ్ ని ముందుకు తీసుకు వెళ్ళారా..? లేదా విడిపోయారా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Also read : Samantha : సమంత వెబ్ సిరీస్ ఫస్ట్ పోస్టర్.. బన్నీ కోసం హనీగా మారిన సమంత..

సినిమా విశ్లేషణ.. ప్రస్తుతం జనరేషన్స్ లోని మ్యారేజ్ రిలేషన్‌షిప్స్ లో జరుగుతున్న విషయాలను తీసుకోని దర్శకుడు ఈ సినిమా కథని రాసుకున్నారు. లైఫ్ పార్ట్నర్ ని అర్థంచేసుకోకుండా, ప్రేమ మరియు లస్ట్ కి అర్ధం తెలుసుకోకుండా చాలామంది విడాకులతో విడిపోతున్నారు. ఆ విషయాన్ని దర్శకుడు చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ గా చెప్పేసారు.

నటీనటుల విషయానికొస్తే.. ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ రొమాంటిక్ పాత్రల్లో బాగానే నటించారు. తమ యాటిట్యూడ్ అండ్ జోలీ లైఫ్ తో రియల్ లైఫ్ పాత్రలని గుర్తు చేసారు. ఇక కమల్ కామరాజు, పూజ ఝవేరి ఎమోషనల్ రోల్స్ లో తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.

సాంకేతిక విషయాలు.. సినిమా మొత్తం దాదాపు ఈ రెండు జంటల చుట్టూనే తిరుగుతుంది. అంతేకాదు ప్రేమకి సంబంధించిన సీన్స్ చాలా తక్కువుగానే చూపించారు. ఎక్కువ రొమాన్స్ మాత్రమే కనిపిస్తుంది. ఈ ఒక్క విషయం కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలాగే కామెడీ లేకపోవడంతో కూడా కొంచెం బోర్ కలిగిస్తుంది.

మొత్తంగా ‘మిక్సప్’ మూవీ లవ్ అండ్ లస్ట్ ని మిక్స్ చేస్తూ బాగానే ఆకట్టుకుంది.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.