Telugu Films Shooting: ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే..?
భోళాశంకర్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లిన మెగాస్టార్, ఫినిషింగ్ టచెస్ లో సర్కారువారిపాట, ఫుల్ స్పీడ్ లో ఉన్న భీమ్లానాయక్, మైసూర్ చెక్కేసిన నాగార్జున... ఇలా స్టార్ హీరోలందరూ..

Telugu Films Shooting
Telugu Films Shooting: భోళాశంకర్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లిన మెగాస్టార్, ఫినిషింగ్ టచెస్ లో సర్కారువారిపాట, ఫుల్ స్పీడ్ లో ఉన్న భీమ్లానాయక్, మైసూర్ చెక్కేసిన నాగార్జున… ఇలా స్టార్ హీరోలందరూ షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఏహీరోలు ఎక్కడ షూటింగ్ లో ఉన్నారో, ఏ సెట్ మీదున్నారో చూద్దాం.
Star Hero Fans: ఫ్యాన్స్ సోషల్ అరాచకం.. పాపం మేకర్స్‌కు వణుకే..!
మెగాస్టార్ స్పీడ్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ నెల 11న మెహర్ రమేష్ తో భోళాశంకర్ సినిమా అఫీషియల్ గా స్టార్ట్ చేసిన చిరంజీవి.. ఆ సినిమాని ఈ సోమవారం సెట్స్ మీదకు తీసుకెళ్లి షూటింగ్ మొదలుపెట్టేశారు. కీర్తిసురేష్ చెల్లెలిగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా చిరంజీవికి హీరోయిన్ గా నటిస్తోంది.
Small Films Releases: స్టార్స్ లేరు.. సందడి చేస్తున్న చిన్న సినిమాలు!
సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి బరినుంచి తప్పుకున్నా.. సర్కారు వారి పాట షూటింగ్ ని మాత్రం సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు. మహేష్ బాబు, పరశురామ్ డైరెక్షన్లో నటిస్తున్న సర్కారువారి పాట సినిమా షూటింగ్ అన్నపూర్ఱ సెవెన్ ఏకర్స్ లో జరుగుతోంది. మరో వైపు సంక్రాంతి బరిలోనే ఉన్నానని గట్టిగా చెబుతున్న పవన్ కళ్యాణ్, రానా భీమ్లానాయక్ సినిమా షూటింగ్ ఫిల్మ్ సిటీలో అంతే స్పీడ్ తో జరుగుతోంది.
Akhanda: బాలయ్య-బోయపాటి.. టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేస్తారా?
రామ్ చరణ్, శంకర్ క్రేజీ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతఉంటే.. ఇంకో నెల రోజుల్లో డిసెంబర్ 17న రిలీజ్ అవుతున్న అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.
Hansika Motwani: యాపిల్ బ్యూటీ హన్సిక గ్లామర్ ట్రీట్!
సంక్రాంతి బరిలోకి ఎలా అయినా దిగాలని.. ట్రై చేస్తున్న నాగార్జున బంగార్రాజు సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతోంది. ఆల్రెడీ ఓ సినమాని ఓటీటీ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన వెంకటేష్ , వరుణ్ తేజ్ తో చేస్తున్న ఎఫ్ 3 సినిమా షూటింగ్ ని షాద్ నగర్ లో చేస్తున్నారు.
Kamal Hasan: కమల్, విక్రమ్, సేతుపతి.. ఓ భారీ మల్టీస్టారర్!
రవితేజ నటిస్తున్న రామారావ్ ఆన్ డ్యూటీ చిత్రం షూటింగ్ రంపచోడవరంలో నాని నటిస్తున్న అంటే సుందరానికి మూవీ సికింద్రాబాద్ లో, గోపీచంద్ మారుతి డైరక్షన్లో రూపొందుతున్న పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్ నార్సింగ్ లో జరుగుతుంటే.. శర్వానంద్ నటిస్తున్న ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.