Vijay Deverakonda : విజయ్ దేవరకొండ పై అసభ్యకర వార్తలు.. అరెస్ట్ చేసిన పోలీసులు..

విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ వస్తుంటాయి. అయితే కొందరు శృతిమించి విజయ్ పై అసభ్యకరంగా వార్తలను వ్యాప్తి చేస్తుంటారు. ఈక్రమంలోనే ఒక వ్యక్తి హద్దు దాటడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ పై అసభ్యకర వార్తలు.. అరెస్ట్ చేసిన పోలీసులు..

Telugu Youtuber arrest for abusing Family Star Vijay Deverakonda unnecessarily

Updated On : December 13, 2023 / 7:39 PM IST

Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాని సంక్రాంతికి తీసుకు వచ్చేందుకు శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇది ఇలా ఉంటే, విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ వస్తుంటాయి. అయితే కొందరు శృతిమించి విజయ్ పై అసభ్యకరంగా వార్తలను వ్యాప్తి చేస్తుంటారు.

ఈక్రమంలోనే ఒక వ్యక్తి హద్దు దాటడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనంతపురంకు చెందిన వెంకట కిరణ్ అనే యూట్యూబర్ ‘సినీ పోలీస్’ అనే యూట్యూబ్ ఛానల్ ని నడుపుతున్నాడు. ఇక ఈ ఛానల్ లో విజయ్ దేవరకొండ పై అసత్యపు వార్తలను ప్రసారం చేస్తూ విజయ్ గౌరవాన్ని కించపరిచేలా వీడియోలు చేస్తున్నాడు. కేవలం విజయ్ మీదనే కాకుండా ఆయనతో కలిసి నటించిన హీరోయిన్స్ ని కూడా అవమానపరిచేలా వీడియోలు చేస్తున్నారు.

Also read : Salaar : సలార్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. సూర్యుడే గొడుగు పట్టి..

దీంతో ఇతడి ఆగడాలని సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకు వెళ్లారు. సైబర్ పోలీసులు వెంటనే స్పందించి కొన్ని గంటల్లోనే వెంకట కిరణ్ ని అరెస్ట్ చేశారు. వెంకటకి కౌన్సిల్ గా ఇచ్చి, అతడి చేత యూట్యూబ్ ఛానల్ ని, వీడియోలను డిలీట్ చేయించారు. భవిషత్తులో మళ్ళీ ఇలాంటి వాటికీ పాల్పడినా, సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ లో బ్యాడ్ కామెంట్స్ చేసినా కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు హెచ్చరించారు.

ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే.. విజయ్ కి గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన పరుశురామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ఈ సినిమాలో ఫాదర్‌గా మిడిల్ క్లాస్ వ్యక్తిగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీస్టార్‌ టీమ్‌ అమెరికాలో నాన్‌స్టాప్‌గా షూట్ చేస్తూ బిజీగా ఉంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.