దళపతి 64 – కొబ్బరికాయ కొట్టారు!

‘దళపతి’ విజయ్, మాళవిక మోహనన్ జంటగా.. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘దళపతి 64’ చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

  • Published By: sekhar ,Published On : October 4, 2019 / 08:22 AM IST
దళపతి 64 – కొబ్బరికాయ కొట్టారు!

Updated On : October 4, 2019 / 8:22 AM IST

‘దళపతి’ విజయ్, మాళవిక మోహనన్ జంటగా.. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘దళపతి 64’ చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

‘దళపతి’ విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘బిగిల్’ సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. ‘బిగిల్’ తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని ‘మా నగరం’, ‘ఖైదీ’ సినిమాల ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చెయ్యబోయే సినిమాకు కొబ్బరికాయ కొట్టేశాడు విజయ్.

ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న దళపతి 64 చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విజయ్‌తో సహా మూవీ టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మాళవిక మోహనన్ విజయ్‌తో జోడీ కడుతుంది.

Read Also : వైరల్ అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్స్..

మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. ఇదే నెలలో షూటింగ్ స్టార్ట్  చేసి, 2020 వేసవిలో విడుదల చెయ్యనున్నారు. అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చెయ్యనుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.