Vijay : విజయ్ నెక్స్ట్ సినిమా టైటిల్ అనౌన్స్.. సుడిగాలి సుధీర్ టైటిల్ కొట్టేసిన దళపతి..
దళపతి విజయ్ నెక్స్ట్ సినిమా టైటిల్ కోసం సుడిగాలి సుధీర్ టైటిల్ ని కొట్టేసారు.

Thalapathy Vijay copy Sudigali Sudheer movie title for his 68th film title
Vijay : తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్.. రీసెంట్ గా లియో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం తన 68వ సినిమాని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. Thalapathy68 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ చేస్తున్న మూవీ టీం.. నేడు టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.
ఈ చిత్రానికి ‘ది గోట్’ (The Greatest Of All Time) అనే ఇంగ్లీష్ టైటిల్ ని అనౌన్స్ చేశారు. అయితే ఇదే టైటిల్ తో మన సుడిగాలి సుధీర్ ఆల్రెడీ ఓ సినిమా అనౌన్స్ చేసి షూటింగ్ ని కూడా పూర్తి చేసే టైంకి చేరుకున్నారు. విశ్వక్ సేన్ తో ‘పాగల్’ వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పుడు సుధీర్ సినిమాతోనే విజయ్ మూవీ అనౌన్స్ చేయడంతో.. సుధీర్ సినిమా మరోసారి ట్రెండ్ అవుతుంది.
Also read : 2023 Roundup : 2023లో ఎక్కువ హిట్స్ అందుకున్న హీరోయిన్స్ వేరే..
— Vijay (@actorvijay) December 31, 2023
ఇక ఈ టైటిల్ తో పాటు మూవీలోని విజయ్ లుక్స్ ని కూడా రివీల్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో విజయ్ ఈ మూవీలో.. తండ్రీకొడుకులుగా రెండు పాత్రలు చేయబోతున్నారని తెలుస్తుంది. కాగా ఈ మూవీ స్టోరీకి సంబంధించిన ఒక కథ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. 1971లో డిబి కూపర్ అనే వ్యక్తి విమానంలో భారీ దొంగతనానికి పాల్పడి.. గాలిలో ఉన్న విమానం నుంచి పారాచ్యుట్ తో దొకేశాడు.
ఆ కూపర్ అనే వ్యక్తి ఇప్పటికి దొరకలేదు. ఆ మిస్టరీని బేస్ చేసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు. AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నారు. 2024 సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది