Thaman comments on Veerasimha reddy Movie
Thaman : బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హాని రోజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాని తమన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇటీవల తమన్ ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ గత సినిమా అఖండకి కూడా సౌండ్ బాక్సులు బద్దలయ్యే మ్యూజిక్ ఇచ్చి అదరగొట్టాడు. అఖండ సినిమా మ్యూజిక్ కి తమన్ కి మంచి పేరు వచ్చింది. ఇక వీరసింహారెడ్డికి కూడా తమన్ మ్యూజిక్ కొట్టాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సినిమాలో BGM ఏ రేంజ్ లో కొట్టాడో అనుకుంటున్నారు అభిమానులు. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్ సినిమా గురించి మాట్లాడాడు.
Shruthi Haasan : సౌత్, నార్త్ సినిమాలు అని విడదీసి చూడటం కరెక్ట్ కాదు..
తమన్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గత సినిమా అఖండకి పూర్తిగా భిన్నమైన సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇందులోని బాలయ్య రెండు పాత్రాల్ని గోపీచంద్ చాలా అద్భుతంగా రాశాడు. సంగీతం ఇచ్చే స్కోప్ సినిమాలో ఉంది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ లో అయితే నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్ తో ఉంటుంది సినిమా. అసలు స్క్రీన్ మీద నుంచి చూపు పక్కకి తిప్పరు. పాప్‌కార్న్ తినే సమయం కూడా ఉండదు అని అన్నారు. దీంతో బాలయ్య అభిమానులు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకుంటున్నారు.