Thaman : చరణ్ ఫ్యాన్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన తమన్.. ఆ డ్యాన్స్ రీల్ చూసి.. ఏంటంటే..?
తాజాగా తమన్ ఓ వీడియో పైన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

Thaman Reacts on A Game Changer Movie Song Reel
Thaman : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ మూవీ పై అంచనాలను పెంచేసే విధంగా థమన్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ పై పోస్టులు పెడుతూ ఉంటారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి 2 పాటలు కూడా రిలీజ్ చేశారు. అందులో ‘రామచ్చా మచ్చా..’ అనే పాట సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది. ఎక్కడ చుసినా ఈ పాటకి డాన్స్ లు వేస్తూ రీల్స్ చేస్తున్నారు. అయితే తాజాగా తమన్ ఇలాంటి ఒక వీడియో పైనే సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఓ కుర్రాడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలోని రామచ్చా మచ్చా.. పాటకి డాన్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసాడు.
Also Read : Kanguva Second Song : సూర్య కంగువా నుంచి రెండో పాట.. దిశతో సూర్య సెప్టులు అదుర్స్
దానికి థమన్ స్పందిస్తూ.. తన డీటెయిల్స్ కనుక్కోండి మన రాబోయే ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనతో డాన్స్ చేయిద్దాం అంటూ పేర్కొన్నాడు. దీంతో ఆ అబ్బాయి లక్కీ ఛాన్స్ కొట్టేసాడు అని, తమన్ సూపర్ ఆఫర్ ఇచ్చాడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా తమన్ ని మెప్పించిన ఆ అబ్బాయి డ్యాన్స్ చూసేయండి..
Wowowowowowow !!
Talent !! 💥💥💥💥💥💥💥💥💥💥@Harikaa_18 Get His Contact details
Let him
Perform on one of our the pre release events @Supremo_TFG !! #RaMachaMacha 🔥🔥🔥🔥🔥 https://t.co/BWpGhKplrf— thaman S (@MusicThaman) October 21, 2024