చెంప దెబ్బకే విడాకులా? – తాప్సీ ‘తప్పడ్’ ట్రైలర్

తాప్సీ పన్ను గృహిణిగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘తప్పడ్’ ట్రైలర్ రిలీజ్.. సినిమా ఫిబ్రవరి 28 విడుదల..

  • Published By: sekhar ,Published On : January 31, 2020 / 10:23 AM IST
చెంప దెబ్బకే విడాకులా? – తాప్సీ ‘తప్పడ్’ ట్రైలర్

Updated On : January 31, 2020 / 10:23 AM IST

తాప్సీ పన్ను గృహిణిగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘తప్పడ్’ ట్రైలర్ రిలీజ్.. సినిమా ఫిబ్రవరి 28 విడుదల..

#ThappadTrailer తాప్సీ పన్ను.. బాలీవుడ్‌లో కథా బలం ఉన్న సబ్జెక్టులు, నటనకు ఆస్కారమున్న పాత్రలు ఎంచుకుంటూ సినిమా సినిమాకీ నటిగా ఒక్కో మెట్టు ఎదుగుతుంది.

తాప్సీ గృహిణిగా నటించిన తాజా చిత్రం ‘తప్పడ్’. అనుభవ్ సుశీల సిన్హా దర్శకత్వంలో భూషణ్ సుదేశ్ కుమార్, కృష్ణన్ కృష్ణ కుమార్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

Thappad

ట్రైలర్ ప్రారంభంలోనే భర్తతో విడాకులు తీసుకోవడానికి గల కారణం గురించి తాప్సీ తన లాయర్‌కు చెబుతూ కనిపించింది. ఓ పార్టీలో అందరి ముందూ భర్త తనని కొట్టాడని తాప్సీ విడాకులకు అప్లై చేస్తుంది.

‘మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి మీ భర్త నుంచి కోర్టు నోటీసులు వచ్చాయి’ అని లాయర్ చెబితే.. ‘నేను వెళ్లను’ అంటూ తాప్సీ జవాబివ్వడం.

Read Also : సరిలేరు సక్సెస్ గురించి స్పందించిన సూపర్‌స్టార్ కృష్ణ!

Tapsee

‘మీ భర్తకు ఏదైనా ఎఫైర్ ఉందా?’ అని లాయర్ అడగ్గా.. తాప్సీ ‘నో’ చెబుతుంది. ‘పోనీ మీకు ఏదైనా ఎఫైర్ ఉందా?’ అంటే తాప్సీ మళ్లీ ‘నో’ చెబుతుంది.

దీంతో లాయర్ ‘కేవలం పార్టీలో చెంపదెబ్బ కొట్టారనే కారణంగా మీరు మీ భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా’ అని ఆశ్చర్యంగా అడగ్గా.. ‘అది కేవలం చెంపదెబ్బ మాత్రమే కాదు’ అంటూ తాప్సీ చెప్పడం ఆసక్తి కరంగా అనిపిస్తుంది. ఫిబ్రవరి 28న ‘తప్పడ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

రచన : అనుభవ్ సుశీల సిన్హా, మృన్మయి లగూ వైకుల్, స్క్రిప్ట్ కన్సల్టెంట్ : అంజుమ్ రాజబలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాగర్ వైశాలి , డీఓపీ : సౌమిక్ షర్మిల ముఖర్జీ, ఎడిటర్ : యషా పుష్పా రామ్‌చందాని, బ్యాగ్రౌండ్ స్కోర్ : మంగేష్ ఉర్మిళా ధక్డే.