Tharun Bhascker : తరుణ్ భాస్కర్ సినిమాటిక్ యూనివర్స్.. పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది పాత్రలతో..

పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది పాత్రలతో తరుణ్ భాస్కర్ సినిమాటిక్ యూనివర్స్..

Tharun Bhascker : తరుణ్ భాస్కర్ సినిమాటిక్ యూనివర్స్.. పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది పాత్రలతో..

Tharun Bhascker cinematic universe with Pelli Choopulu Ee Nagaraniki Emaindhi

Updated On : October 18, 2023 / 9:06 PM IST

Tharun Bhascker : టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ దర్శకుడు తన మూడో సినిమాగా ‘కీడా కోలా’ అనే చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని ప్రెస్ మీట్ పెట్టి లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం మూవీ టీం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈక్రమంలో తరుణ్ భాస్కర్.. పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది పాత్రలతో ఒక సినిమాటిక్ యూనివర్స్ గురించి కామెంట్స్ చేశాడు.

ఈ ప్రెస్ మీట్ లో ఒక విలేకరి.. “పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది రెండు క్లాసిక్ సినిమాలు. వీటిలో ఒకదానికి సీక్వెల్ తీసుకు రావాలంటే.. మీరు దేనికి సీక్వెల్ తీసుకు వస్తారు” అని ప్రశ్నించారు. దీనికి తరుణ్ భాస్కర్ బదులిస్తూ.. “నాకు సీక్వెల్ అని కాదు. పెళ్లి చూపులు సినిమాలో ప్రశాంత్ క్యారెక్టర్‌ని, ఈనగరానికి ఏమైంది మూవీలోని కౌశిక్ క్యారెక్టర్‌ని ఒక డెవలప్ చేసి ఒక సీరియస్ స్టోరీ రాయాలని ఉంది. థ్రిల్లర్ జోనర్ లో ఆ రెండు పాత్రలతో సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా” అంటూ చెప్పుకొచ్చాడు.

Also read : Family Star Glimpse : ‘ఫ్యామిలీ స్టార్’గా విజయ్ దేవరకొండ మాస్.. గ్లింప్స్ అదుర్స్..

ఇక ఈ మాటలు విన్న ఆడియన్స్.. ‘తరుణ్ భాస్కర్ సినిమాటిక్ యూనివర్స్’ అంటూ కామెంట్స్ చేశారు. కాగా ప్రశాంత్ పాత్రని విజయ్ దేవరకొండ, కౌశిక్ పాత్రని అభినవ్ గౌతమ్ పోషించారు. ఇక ‘కీడా కోలా’ విషయానికి వస్తే.. ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ తో పాటు తరుణ్ భాస్కర్ కూడా నటిస్తున్నాడు. నవంబర్ 3న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అయిన ట్రైలర్ మంచి స్పందన అందుకుంటుంది.