Tharun Bhascker Keedaa Cola : రాజమౌళి ఈగతో వస్తే.. తరుణ్ భాస్కర్ బొద్దింకతో రాబోతున్నాడు.. కీడా కోలా అప్డేట్!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుంచి మరో సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు అందరికి గుడ్ న్యూస్ వచ్చేసింది. తరుణ్ మరో క్రేజీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజమౌళి ఈగతో సినిమా తీస్తే, తరుణ్ బొద్దింకతో సినిమా తీస్తా అంటున్నాడు.

Tharun Bhascker Keedaa Cola : రాజమౌళి ఈగతో వస్తే.. తరుణ్ భాస్కర్ బొద్దింకతో రాబోతున్నాడు.. కీడా కోలా అప్డేట్!

Tharun Bhascker Keedaa Cola

Updated On : January 30, 2023 / 12:13 PM IST

Tharun Bhascker Keedaa Cola : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుంచి మరో సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు అందరికి గుడ్ న్యూస్ వచ్చేసింది. తన డిఫరెంట్ మేకింగ్ తో ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ని కలగజేసే తరుణ్.. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీ లైన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మొదటి సినిమా పెళ్లి చూపులుతోనే నేషనల్ అవార్డుని అందుకొని ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆ తరువాత వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ లో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు తరుణ్ భాస్కర్.

Tharun Bhascker new movie Opening : ఘనంగా తరుణ భాస్కర్ కొత్త సినిమా ‘కీడా కోలా’ ఓపెనింగ్

దీంతో ఈ దర్శకుడి నుంచి తదుపరి సినిమా కోసం చాలా ఆతురతగా ఎదురు చూస్తున్నారు అభిమానులంతా. ‘ఈ నగరానికి ఏమైంది-2’ చిత్రాన్ని తీసుకు రావాలని ఫ్యాన్స్ అందరూ అడుగుతుండగా, తానూ స్క్రిప్ట్ వర్క్ పై పని చేస్తున్నాను అంటూ ఇటీవల తెలియజేశాడు. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అనుకున్నారు అందరూ. కానీ తరుణ్ అంతకుమించిన క్రేజీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజమౌళి ఈగతో సినిమా తీస్తే, తరుణ్ బొద్దింకతో సినిమా తీస్తా అంటున్నాడు. ఇటీవలే ‘కీడా కోలా’ అనే టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు.

కీడా అంటే బొద్దింక అని అర్ధం. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే నటించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలై శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ గురించి అప్డేట్ ఇచ్చాడు తరుణ్ భాస్కర్. అప్డేట్ ఇస్తున్నాము తీసుకోవాలి అంటూ షూటింగ్ సెట్స్ నుంచి ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 3న ఈ అప్డేట్ రానుంది. సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేస్తారు అని టాక్ వినిపిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ అప్డేట్ గురించి విన్న తరుణ్ భాస్కర్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.