Guppedantha Manasu : జగతి మేడం చనిపోయింది.. గుప్పెడంత మనసు సీరియల్‌లో భారీ ట్విస్ట్
రిషి, వసుధర పెళ్లి జరుగుతుంది. అప్పటిదాకా వారి పెళ్లి సంతోషంగా చూస్తున్న జగతికి ఏమైంది ? గుప్పెడంత మనసు సీరియల్‌లో భారీ ఎమోషనల్ సీన్

Guppedantha Manasu serial
Guppedantha Manasu : వసుధర, రిషి పెళ్ళి వేడుక మొదలవుతుంది. రిషి , వసుధర మెడలో తాళి కట్టగానే అనూహ్యమైన సంఘటన జరుగుతుంది.
రిషి, వసుధర పెళ్ళికి రెడీ అవుతారు. రిషిని వసుధర ఈ పెళ్లి మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారా? అని అడుగుతుంది, మా అమ్మకోసం ఈ పెళ్లి చేసుకుంటున్నాను అంటాడు రిషి. మీ అమ్మగారు రాలేదా అని వసుధరని అడుగుతాడు. ఆమె సమాధానం పూర్తిగా వినకుండానే అక్కడి నుంచి హాల్లోకి వస్తాడు.
పంతులు పెళ్లి తంతు మొదలు పెడతాడు. పెళ్లి బట్టల్లో ఉన్న రిషి, వసుధరని చూసి జగతి సంతోషపడుతుంది. తనకి ఏమైనా అయితే మహీంద్రని జాగ్రత్తగా చూసుకోవాలి అని రిషికి చెబుతుంది. అంత మాట అనొద్దు అంటాడు రిషి. పెళ్లి తంతు మొదలవుతుంది. పూజారి ఇద్దరికీ బాసికాలు కట్టమని చెబుతాడు. పెద్దమ్మ దేవయాని బాసికం కట్టబోతుంటే జగతితో కట్టించుకుంటాను అంటాడు రిషి. జగతి రిషి, వసుధరకు బాసికాలు కడుతుంది. రిషి, వసుధర మెడలో తాళి కడతాడు.
రిషి, వసుధర జగతి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటారు. వారిని సంతోషంగా ఆశీర్వదిస్తూ జగతి అలా ఉండిపోతుంది. ఏమైందో అని అందరు ఆందోళన పడతారు. నర్స్ ఆమె నాడి చూసి చనిపోయింది అని చెప్తుంది. అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. జగతి అంత్యక్రియలకు తీసుకువెడుతున్న సీన్‌తో గుండె బరువెక్కుతుంది.
గుప్పెడంత మనసు సీరియల్‌లో ముకేశ్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు.