The Kerala Story: కాంట్రవర్సీ మూవీకి ట్యాక్స్ ఫ్రీ.. ఎక్కడో తెలుసా?
అదా శర్మ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది కేరళ స్టోరి’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ మూవీ కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిలిచింది.

The Kerala Story Gets Tax Free In Madhya Pradesh
The Kerala Story: అదా శర్మ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది కేరళ స్టోరి’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ మూవీ కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాలో పలు సున్నితమైన అంశాలను ప్రస్తావించారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు.
The Kerala Story : పొలిటికల్ హీట్ పెంచుతున్న ‘ది కేరళ స్టోరీ’
కేరళలో జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంటోంది. అయితే, ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ తమిళనాట నినాదాలు వినిపిస్తుండగా, ఇప్పుడు ఈ సినిమాకు మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుని ఇస్తోంది. ఈ సినిమాను మధ్యప్రదేశ్‌లో ట్యాక్స్ ఫ్రీ మూవీగా ఆ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. దీంతో ఈ మూవీకి మధ్యప్రదేశ్‌లో ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ లేదు.
The Kerala Story : ది కేరళ స్టోరీ.. మరో కశ్మీర్ ఫైల్స్ కానుందా?
ఈమేరకు మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ చౌహాన్ తన అఫీషియల్ ట్విట్లర్ అకౌంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. హిందూ యువతులను ప్రేమ పేరుతో ఇస్లాంలోకి మార్చి వారితో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ సినిమాలో చూపించడంతో ఈ మూవీ ప్రస్తుతం అనేక వివాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. మరి మున్ముందు ఈ సినిమా ఇంకా ఎలాంటి వివాదాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.