The Red Bag: ఒక బ్యాగ్ చుట్టూ తిరిగే మిస్టరీ కథ.. ఆసక్తిరేపుతున్న ‘ది రెడ్ బ్యాగ్’ ఫస్ట్ లుక్
సరికొత కథతో వస్తున్న ది రెడ్ బ్యాగ్ మూవీ(The Red Bag) ఫస్ట్ లుక్ మేకర్స్ విడుదల చేశారు.
the red bag movie first look released
The Red Bag: ఒక రహస్యమైన బ్యాగ్ చుట్టూ అల్లుకున్న ఉత్కంఠభరిత కథాంశంతో ‘ది రెడ్ బ్యాగ్(The Red Bag)’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ను హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్తో నిర్మించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతోంది. విలక్షణ నటుడు కబీర్ దుహన్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక వంటి భారీ తారాగణం ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో కీలక పాత్రలు పోషించారు.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను యువ హీరో దినేష్ తేజ్, దర్శకుడు హరి ప్రసాద్ కలిసి విడుదల చేశారు. పోస్టర్ చూస్తుంటే సినిమాపై మంచి క్యూరియాసిటీ కలుగుతోంది. మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు ముఖ్య భూమికల్లో మెరవనున్నారు. కేవలం ఒక బ్యాగ్ చుట్టూ కథను తిప్పుతూ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు సమాచారం. ‘ది రెడ్ బ్యాగ్’ త్వరలోనే గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది.

