Sameera Baradwaj : నటిగా మారుతున్న సింగర్.. రీల్స్ చూసి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్..
సమీరా దాదాపుగా 15 ఏళ్ల నుండి సింగర్ గా కొనసాగుతుంది. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది.

The singer sameerabharadwaj who is becoming an actress The director mohan indraganti gave her chance after seeing the reels
Sameera Baradwaj : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ ఇంద్రగంటి దర్శకత్వంలో రానున్న లేటెస్ట్ సినిమా ‘సారంగపాణి జాతకం’. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. రూప కొడువాయూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 14న విడుదల కానుంది.
అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో దీనికి సంబందించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ” నిజానికి ఖాలీగా ఉన్నప్పుడు రీల్స్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం. రీల్స్ ద్వారా ఎందరో టాలెంట్ ను నేను గుర్తించాను. ఇలా రీల్స్ చూసే సింగర్ సమీరాను కలిసాను. తనకున్న టాలెంట్ చూసి ‘సారంగపాణి జాతకం’ సినిమాలో చిన్న పాత్రలో నటించమని చెప్పానని తెలిపారు.
Also Read : Jailer 2 : ఆ స్పెషల్ డేనే జైలర్ 2 అప్డేట్.. ప్రోమో కూడా అప్పుడేనా..
అంతేకాదు.. అసలు ఈ పాత్రకి తనని పిలవాల్సిన అవసరం లేదు కానీ తను ఈ పాత్రకి అవసరం. ఈ పాత్రలో తను మెరవాలి. తెలుగు బాగా మాట్లాడాలి. అందుకే తనని తీసుకున్నాం. తన రీల్స్ చూసి తనకి ఫోన్ చేసాను. నేను నీ రీల్స్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పాను. ఆ అమ్మాయి ఒక రీల్ చేసింది. అమ్మా నేను ఒక అబ్బాయిని లవ్ చేశా అంటే తన తల్లి గ్యాప్ ఇవ్వకుండా ప్రశ్నలు అడుగుతుంటుంది.. ఆ రీల్ చూసి తనని మా సినిమాలో చేస్తావా అని అడిగా. వెంటనే ఆ అమ్మాయి కూడా ఈ సినిమాలో చెయ్యడానికి ఓకే చెప్పింది అంటూ తెలిపారు మోహన్ ఇంద్రగంటి. దీనికి స్పందించిన సమీరా థాంక్స్ సర్ అని రిప్లై ఇచ్చింది.
View this post on Instagram
ఇక సమీరా దాదాపుగా 15 ఏళ్ల నుండి సింగర్ గా కొనసాగుతుంది. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. అలాగే రీల్స్ సైతం చేస్తుంటుంది. రీల్స్ ద్వారా కూడా భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ రీల్స్ తోనే ఈ సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. ఇన్నాళ్లు సింగర్ గా ఉన్న ఈమె ఇప్పుడు నటిగా మారింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.
View this post on Instagram