Elections Results 2024 : దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల్లో గెలిచిన‌, ఓడిన సెల‌బ్రిటీలు వీళ్లే..

దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ప‌లువురు సినీ తార‌లు పోటీచేశారు. వీరిలో ఎవ‌రు గెలిచారు, ఎవ‌రు ఓడారో ఓ సారి చూద్దాం..

Elections Results 2024 : దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల్లో గెలిచిన‌, ఓడిన సెల‌బ్రిటీలు వీళ్లే..

These are the celebrities who have won and lost elections across the country

Updated On : June 5, 2024 / 4:43 PM IST

ఎన్నిక‌ల ప‌ర్వం పూర్తైంది. దేశంలో ఎన్డీయే ప్ర‌భుత్వం మ‌రోసారి అధికారం ద‌క్కించుకుంది. మూడో సారి ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి విజ‌యం సాధించింది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ సంగ‌తి కాస్త ప‌క్క‌న బెడితే.. దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ప‌లువురు సినీ తార‌లు పోటీచేశారు. వీరిలో ఎవ‌రు గెలిచారు, ఎవ‌రు ఓడారో ఓ సారి చూద్దాం..

– బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మొద‌టిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఎంపీగా ఎన్నికైంది. ఆమె హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మండీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగింది. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ అభ్య‌ర్థి విక్ర‌మాదిత్య సింగ్ పై 74,755 ఆధిక్యంతో గెలుపొంది.

– కేర‌ళ రాష్ట్రంలోని త్రిసూర్ నుంచి మలయాళ నటుడు సురేష్ గోపీ ఎంపీగా గెలిచారు. బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి సీపీఐ అభ్య‌ర్థి సునీల్ కుమార్ పై 74,686 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కాగా..కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయం కావడం గ‌మ‌నార్హం.

– టీవీ రాముడిగా ప్ర‌సిద్ధి చెందిన అరుణ్ గోవిల్ ఎంపీగా గెలుపొందారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్ నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న త‌న సమీప ప్ర‌త్య‌ర్థి స‌మాజ్‌వాదీ పార్టీ అభ్య‌ర్థి సునీత వ‌ర్మ పై 10,585 ఓట్ల ఆధిక్యంతో విజ‌యం సాధించారు.

– టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేసిన రచనా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచి ఎంపీగా గెలిచారు. ఆమె త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి బీజేపీ అభ్య‌ర్థి లాకెట్ చ‌ట‌ర్జీ పై 76,853 ఓట్ల తేడాతో విజ‌యం సాధించింది.

– ‘రేసుగుర్రం’ విలన్ రవికిషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ ఎంపీగా విజ‌యం సాధించారు. బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి స‌మాజ్‌వాదీ పార్టీ అభ్య‌ర్థి భోజ్‌పురి న‌టి అయిన కాజ‌ల్ నిషాద్ పై 1,03, 526 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Venkatesh – Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యే గారు.. అంటూ పవన్ పై వెంకీమామ ఆసక్తికర పోస్ట్..

– బాలీవుడ్ బ్యూటీ క్వీన్ హేమామాలిని ఉత్తరప్రదేశ్‌లోని మధుర నుంచి ఎంపీగా గెలుపొందింది. బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆమె త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ అభ్య‌ర్థి ముకేశ్ ధ‌న్‌గ‌ర్ పై 2,93,407 ఓట్ల తేడాతో విజ‌యం సాధించింది.

– బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సిన్హా పశ్చిమ బెంగాల్‌లోని అసన్ సోల్ నుంచి ఎంపీగా గెలుపొందారు. టీఎంసీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి బీజేపీ అభ్య‌ర్థి సురేంద్ర జీత్ సింగ్ అహ్లు వాలియా పై 59,564 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.

– భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీగా గెలిచారు.

NTR : హమ్మయ్య.. ఎట్టకేలకు ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపు పై స్పందించిన ఎన్టీఆర్.. ఏమన్నాడంటే..

అంతేకాదండోయ్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన టాలీవుడ్ హీరోలు నంద‌మూరి బాలకృష్ణ హిందుపూర్ నుంచి, పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొందారు.

ఇక పోతే.. కొందరు ఓడిపోయారు. షిమోగాలో ఎంపీగా పోటీ చేసిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ భార్య గీత, మహారాష్ట్ర అమరావతి లోక్‌సభ ఎంపీగా పోటీ చేసిన టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ లు ఓడిపోయారు.