Hrithik Roshan: రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ గురించి హృతిక్ తొలి పోస్ట్ ఇదే!
బాలీవుడ్ హీరోలలో కండల వీరుడు హృతిక్ రోషల్ స్టైల్ వేరేగా ఉంటుంది. సల్మాన్ లాంటి బ్యాచిలర్ హీరోలు లవ్, రిలేషన్, డేటింగ్ అంటూ పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంటుంది. మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్..

Hrithik Roshan
Hrithik Roshan: బాలీవుడ్ హీరోలలో కండల వీరుడు హృతిక్ రోషల్ స్టైల్ వేరేగా ఉంటుంది. సల్మాన్ లాంటి బ్యాచిలర్ హీరోలు లవ్, రిలేషన్, డేటింగ్ అంటూ పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంటుంది. మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ విషయంలో కూడా దంగల్ బ్యూటీ ఫాతిమా సనా ఖాన్ తో ప్రేమలో ఉన్నాడని.. ఆ కారణంగానే కిరణ్ రావుకు విడాకులు ఇచ్చారని బీ టౌన్ కోడై కూసింది. అయితే హృతిక్ విషయంలో ఇలాంటి రూమర్స్ రాలేదు. హీరోయిన్ కంగనా రనౌత్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని ప్రచారం జరిగినా అది నిజం కాదని తేలిపోయింది.
Hrithik Roshan: హృతిక్ ఇంట్లో కొత్త గర్ల్‌ఫ్రెండ్.. ఫ్యామిలీతో స్పెషల్ సన్‌డే!
భార్యతో వివాదం కారణంగానే విడాకులిచ్చినా హృతిక్ ఈ మధ్య మళ్ళీ ప్రేమలో పడ్డాడని టాక్. అందుకు తగ్గట్లే హృతిక్ కూడా మీడియాను ఖాతరు చేయకుండా సభా ఆజాద్ అనే అమ్మాయితో కలిసి ముంబయిలోని ఒక ఫేమస్ జపనీస్ రెస్టారెంట్లో ఆ మధ్య విందుకు హాజరయ్యాడు. రెస్టారెంట్ నుండి బయటికి వచ్చేటపుడు హృతిక్ అమ్మాయి చేయి పట్టుకుని నడిపించుకుంటూ కారు దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం, హృతిక్ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసిన తీరు చూసిన మీడియా ఉదయానికి దేశమంతా గుప్పుమంది.
Hrithik Roshan: కొత్త భామతో హృతిక్.. మళ్ళీ ప్రేమలో పడ్డాడా?
ఇక అదే అమ్మాయిని ఈ మధ్యనే ఓ ఆదివారం నేరుగా హృతిక్ ఇంటికే తీసుకెళ్లాడు. హృతిక్ ఫ్యామిలీతో కలిసి లంచ్.. ఫ్యామిలీతో సభా గడిపిన తీరును సోషల్ మీడియాలో కూడా పెట్టేశారు. దీంతో ఏమో నిజమేమో అంటూ ముంబై మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే.. దీనిపై హృతిక్ ఇంతవరకు ఔను.. కాదు అని స్పందించనేలేదు. అయితే.. తొలిసారి సభా గురించి హృతిక్ ఓ పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడు మరోసారి వీళ్ళ వ్యవహారం మీడియాలో నానుతుంది.
బాలీవుడ్ స్టార్ల కన్నా మన దక్షిణాది హీరోల సంపాదనే ఎక్కువ.. టాప్ 5 ఎవరెవరు? ఎంతంటే?
సబా ఆజాద్, నసీరుద్దీన్ షా కొడుకు ఇమాద్ షా కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసిన హృతిక్ రోషన్.. ‘కిల్ ఇట్ యూ గాయ్స్’అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీనికి సబా సైతం హృతిక్‌కి థ్యాంక్స్ చెబుతూ మరో పోస్ట్ పెట్టింది. సబా, ఇమాద్ జంటగా ఓ షోలో పార్టిసిపేట్ చేస్తుండగా.. వాళ్లకు సపోర్ట్‌గా హృతిక్ పోస్ట్ చేసి ఎంకరేజ్ చేశాడు. దీంతో సభాకి అండగా ఉండేందుకు సిద్దమైన హృతిక్ ఇలా ముందే ఇండికేట్ చేస్తున్నాడని.. ఇది అదేనంటూ మరోసారి సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.