Movie Releases : ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
దిల్ రాజు కూతురు హన్షిత దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి చిన్న సినిమాలు చేస్తోంది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు డైరెక్టర్ గా తెరకెక్కించిన బలగం సినిమా మార్చ్ 3న థియేటర్స్......................

This week theatrical movie releases in telugu
Movie Releases : పెద్ద సినిమాల సీజన్ అయిపోయింది. వరస పెట్టి స్టార్ హీరోలందరూ సంక్రాంతి నుంచి స్టార్ట్ చేసి మొన్నటి వరకూ మూవీస్ అన్నీ రిలీజ్ చేశారు. ఇక మళ్లీ సమ్మర్ లో సినిమాల సీజన్ స్టార్ట్ అయ్యే వరకూ ధియేటర్లో చిన్న సినిమాలదే హవా. ఈవారం ధియేటర్లలో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలు ఇవే..
దిల్ రాజు కూతురు హన్షిత దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి చిన్న సినిమాలు చేస్తోంది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు డైరెక్టర్ గా తెరకెక్కించిన బలగం సినిమా మార్చ్ 3న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో సాగనుంది ఈ సినిమా కథ. దిల్ రాజు ప్రొడక్షన్ అవ్వడంతో ప్రమోషన్స్ మాత్రం భారీగానే చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న సోహైల్ హీరోగా, మిర్నాళిని రవి హీరోయిన్ గా రాజేంద్రప్రసాద్, మీనా ముఖ్య పాత్రలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్గానికి మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమా కూడా మార్చ్ 3న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ సినిమాలు తీసే ఎస్వీ కృష్ణారెడ్డి నుంచి సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
రిచిగాడి పెళ్లి అనే మరో సినిమా కూడా మార్చ్ 3న రిలీజ్ కానుంది. పెళ్ళికి వెళ్లి అక్కడ ఒక గేమ్ ఆడితే అందరి లైఫ్స్ ఎలా మారిపోయాయి అనే అంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుంది.
Santhosh Naryanan : వరుసగా తెలుగు సినిమాల ఆఫర్స్ పట్టేస్తున్న తమిళ మ్యూజిక్ డైరెక్టర్..
బిందు అనే ఓ యువతీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సాచి సినిమా మార్చ్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్తవాళ్లతో తెరకెక్కిన మరో సినిమా గ్రంధాలయం కూడా మార్చ్ 3న విడుదల కానుంది. గ్రంథాలయంలోని ఓ పుస్తకాన్ని చదివిన వాళ్లంతా చనిపోతుంటారు, దాని వెనక ఉన్న మిస్టరీ ఏంటి అనే కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.