Tiger Shroff : టైగర్‌ ష్రాఫ్‌ తల్లిని మోసం చేసిన వ్యక్తి.. బురిడీ కొట్టించి అరకోటి మాయం.. పోలీసులకు పిర్యాదు..

బాలీవుడ్ స్టార్ హీరో టైగర్‌ ష్రాఫ్‌ తల్లిని ఒక వ్యక్తి బురిడీ కొట్టించి అరకోటి పైగా నగదు కొట్టేశాడు. ఆ మోసం తెలుసుకున్న ఆమె పోలీసులకు..

Tiger Shroff : టైగర్‌ ష్రాఫ్‌ తల్లిని మోసం చేసిన వ్యక్తి.. బురిడీ కొట్టించి అరకోటి మాయం.. పోలీసులకు పిర్యాదు..

Tiger Shroff Mother ayesha duped of with her employee

Updated On : June 9, 2023 / 8:39 PM IST

Tiger Shroff : బాలీవుడ్ స్టార్ హీరో టైగర్‌ ష్రాఫ్‌ తల్లి మరియు ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌ సతీమణి అయిన అయేషాను ఒక వ్యక్తి మోసం చేసి అరకోటికి పైగా మాయం చేశాడు. అసలు విషయం ఏంటంటే.. టైగర్‌ ష్రాఫ్‌ ముంబైలో ఎంఎంఏ మ్యాట్రిక్స్‌ పేరుతో ఒక జిమ్‌ ని నడుపుతున్నాడు. ఈ జిమ్ కార్యకలాపాలు టైగర్‌ మరియు అతడి తల్లి కలిసి చూసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం హీరోగా టైగర్‌ ష్రాఫ్‌ కొంచెం బిజీ అవ్వడంతో అయేషానే మొత్తం చూసుకుంటున్నారు. దీంతో ఆమెను అక్కడ చేసే ఒక ఉద్యోగి బురిడీ కొట్టించాడు.

Varun – Lavanya : వరుణ్ – లావణ్య ఎంగేజ్మెంట్‌ కార్యక్రమంలో మెగా, అల్లు కుటుంబాలు..

ఆ జిమ్ లో అలాన్‌ ఫెర్నాండెజ్‌ అనే వ్యక్తి 2018 నుంచి పని చేస్తున్నాడు. ఇక ఇటీవల అయేషా దగ్గరకి వచ్చి.. ఇండియాతో పాటు పలు విదేశాల్లోనూ టోర్నమెంట్స్‌ పెట్టడానికి చేస్తున్నట్లు చెప్పి ఆమె నుంచి దాదాపు 58 లక్షల రూపాయిలను తీసుకున్నాడు. అయితే ఆ తరువాత అతడు చేసిన మోసం తెలుసుకున్న అయేషా పోలీసులను ఆశ్రయించారు. అతడి పై పోలీసులకు పిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయం బయటకి రావడంతో బి టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

Adipurush : ఆదిపురుష్ సీత ముద్దు వ్యవహారం పై.. రామాయణం సీరియల్ సీత కామెంట్స్..

ఇక టైగర్ ష్రాఫ్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. గణపత్ (Ganapath) అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాని రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. కృతి సనన్ (Kriti Sanon) హీరోయిన్ గా నటిస్తుంటే అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే అక్షయ్ కుమార్ (Akshay Kumar) తో కలిసి ‘బడే మియా చోట మియా’ (Bade Miyan Chote Miyan) వంటి యాక్షన్ ఫిలింలో కూడా నటిస్తున్నాడు.