Evaru Meelo Koteeswarulu: మహేష్ ఎపిసోడ్‌కి ముహూర్తం ఫిక్స్.. టీఆర్పీలు బద్దలే!
సిల్వర్ స్క్రీన్ నుండి బుల్లితెర వరకు తనను తానేంటో చూపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

Evaru Meelo Koteeswarulu
Evaru Meelo Koteeswarulu: సిల్వర్ స్క్రీన్ నుండి బుల్లితెర వరకు తనను తానేంటో చూపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఒకవైపు సామాన్య ప్రజల నుండి కంటెస్టెంట్లతో పాటు వరుసగా టాప్ స్టార్స్ తో కూడా ఎపిసోడ్స్ చేస్తూ షోను హైలెట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇందులో భాగంగానే ముందుగా ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్ళగా తనతో కలిసి ట్రావెల్ చేస్తున్న చరణ్ తోనే లాంచింగ్ ఈవెంట్ చేశారు.
Laal Singh Chaddha : బిగ్ పాన్ ఇండియా క్లాష్!
ఆ తర్వాత ఈ మధ్యనే తారక్ తనకి అత్యంత సన్నిహితులైన దర్శకులు రాజమౌళి, కొరటాల శివలను కూడా తీసుకొచ్చాడు. ఇక, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ షోకి గెస్ట్‌గా రాబోతున్నారనే వార్త కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. ఇద్దరూ షూటింగ్‌లో పాల్గొన్న పిక్ కూడా నెట్టింట వైరల్ అయ్యింది. దసరా లేదా దీపావళికి ఈ స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందన్నారు కానీ తర్వాత దీని గురించిన ఊసేలేదు. అయితే.. ఇప్పుడు ఈ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు షో నిర్వాహకులు.
RRR Movie : రాజమౌళి సినిమాకి సల్మాన్ సపోర్ట్..
కమింగ్ సూన్ వచ్చేస్తున్నాం అంటూ ఇప్పుడు ఇద్దరి మధ్య ఓ పోస్టర్ కూడా బయటకి వచ్చి వైరల్ అవుతుంది. ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే షో యాజమాన్యం కూడా టైం చూసి వదిలేందుకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చేయనుండగా ఎప్పుడన్నది మాత్రం డేట్ ఇప్పటికి ఇంకా ప్రకటించలేదు. అయితే.. ఎప్పుడు ఈ ఎపిసోడ్ విడుదల చేసినా.. టీఆర్పీ రికార్డ్స్ బ్లాస్టింగ్ ఖాయమంటూ సోషల్ మీడియాలో పిక్ తెగ వైరల్ అవుతుంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చూడాలి.