Rana Daggubati : కేసు విషయంలో కోర్టుకు హాజరైన హీరో దగ్గుబాటి రానా

హైదరాబాద్ ఫిలింనగర్ ‌‌లో భూవివాదం కేసులో సినీ హీరో దగ్గుబాటి రానా ఈరోజు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు.

Rana Daggubati : కేసు విషయంలో కోర్టుకు హాజరైన హీరో దగ్గుబాటి రానా

Daggubati Rana

Updated On : July 12, 2022 / 4:50 PM IST

Rana Daggubati :  హైదరాబాద్ ఫిలింనగర్ ‌‌లో భూవివాదం కేసులో సినీ హీరో దగ్గుబాటి రానా ఈరోజు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. ఫిలింనగర్ లో అలనాటి నటి మాధవి లతకు చెందిన 2200 చదరపు గజాల స్ధలాన్ని హీరో దగ్గుబాటి వెంకటేష్ అతని సోదరుడు నిర్మాత దగ్గుబాటి సురేష్ అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అనంతరం 2014 లో ఆస్ధలాన్ని ఒక వ్యాపారికి లీజు ఎగ్రిమెంట్ చేశారు.  2016, 2018 లలో లీజ్ ఎగ్రిమెంట్ రెన్యూవల్ చేసినప్పటికీ,  లీజ్ ఎగ్రిమెంట్ కొనసాగుతుండగానే అందులోని 1000 గజాల స్ధలాన్ని దగ్గుబాటి సురేష్ తన కుమారుడు రానాకి రిజిష్ట్రేషన్ చేశారు.

స్ధలం రిజిష్ట్రేషన్ చేయించుకున్న రానా   అందులోని లీజు దారుడిని   స్ధలం ఖాళీ చేయాలని ఒత్తిడి   చేశారు. ఇంకా లీజు ఎగ్రిమెంట్ ఉండగా స్ధలం  ఖాళీ చేయమని కోరటంతో బాధితుడు సిటీ సివిల్ కోర్టులో పిటీషన్  దాఖలు చేశారు. దీంతో   న్యాయస్దానం   రానాకు నోటీసులు జారీ చేయటంతో ఆయన ఈరోజు  కోర్టుకు హజరయ్యారు.

Also Read : AP High Court : ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శికి నాన్‎ ‎‌బెయిలబుల్ వారెంట్