AP High Court : ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శికి నాన్‎ ‎‌బెయిలబుల్ వారెంట్

ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు ఏపీ హైకోర్టు నాన్‎ ‎‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విచారణకు ఆర్థిక శాఖ కార్యదర్శి గైర్హాజరయ్యారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

AP High Court : ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శికి నాన్‎ ‎‌బెయిలబుల్ వారెంట్

Ap High Court

Updated On : July 12, 2022 / 5:09 PM IST

AP High Court : ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు ఏపీ హైకోర్టు నాన్‎ ‎‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విద్యాశాఖ బిల్లుల చెల్లింపు జాప్యంపై కార్వే సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. దీనికి సంబంధించిన విచారణకు ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ గైర్హాజరు అయ్యారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు.. సత్యనారాయణకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

విద్యాశాఖకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేసినందుకు.. మంగళవారం కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని గత విచారణలో హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, కొందరు అధికారులు కోర్టుకు హాజరయ్యారు. కానీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ మాత్రం హాజరుకాలేదు. దీంతో ధర్మాసనం నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్ జారీ చేసింది. కాగా, బిల్లులు చెల్లించాలని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే.. విద్యాశాఖకు సంబంధించిన బిల్లుల చెల్లింపు జాప్యం మీద కార్వే మేనేజ్ మెంట్ డేటా లిమిటెడ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు రావాల్సిన బిల్లులు ఆలస్యం చేస్తున్నారు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వెంటనే తమకు బిల్లులు చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ కార్వే సంస్థ తన పిటిషన్ లో కోరింది.

Nadendla Manohar: సీఎంను నిద్రలేపేందుకే ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ కార్యక్రమం: నాదెండ్ల

దీని విచారణకు సంబంధించి ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ విచారణకు రావాల్సి ఉంది. కానీ ఆయన రాలేదు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు.. సత్యనారాయణకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సత్యనారాయణను కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. బిల్లుల జాప్యానికి సంబంధించి గతంలో హైకోర్టు పలు మార్లు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏకంగా ఆర్థికశాఖ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.