Directors Meeting : దర్శకులంతా ఒకే చోట చేరారు.. ఏం డిస్కస్ చేస్తున్నారబ్బా..!

పూరి షూటింగ్ కోసం వెళ్లారు సరే.. మరక్కడ టాలెంటెడ్ డైరెక్టర్స్ క్రిష్ జాగర్లమూడి, మోహన్ రాజా, హేమంత్ మధుకర్‌లకు ఏం పని..?

Directors Meeting : దర్శకులంతా ఒకే చోట చేరారు.. ఏం డిస్కస్ చేస్తున్నారబ్బా..!

Directors Meeting

Updated On : August 24, 2021 / 3:37 PM IST

Directors Meeting: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండ, అనన్య పాండేలతో పాన్ ఇండియా ఫిలిం ‘లైగర్’ తీస్తున్నారు. రీసెంట్‌గా ముంబైలో షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. పూరి వెంట ఛార్మీ కూడా ఉంది. పూరి షూటింగ్ కోసం వెళ్లారు సరే.. మరక్కడ టాలెంటెడ్ డైరెక్టర్స్ క్రిష్ జాగర్లమూడి, మోహన్ రాజా, హేమంత్ మధుకర్‌లకు ఏం పని..?

Liger

అవును.. బాంబేలో ఈ ముగ్గురు దర్శకులు.. పూరిని కలిశారు. నలుగురు కలిసి కాసేపు ఎంచక్కా కబుర్లు చెప్పుకున్నారు. తమ సినిమాల గురించిన విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ దర్శకులంతా మాట్లాడుకుంటుండగా.. పిక్ తీసిన ఛార్మీ.. వీళ్లు ఏం డిస్కస్ చేస్తున్నారో గెస్ చెయ్యండి అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Puri – Charmy: ‘లైగర్’ కోసం పూరి – ఛార్మీ..

ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్‌తో ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ చేస్తున్నారు మోహన్ రాజా. క్రిష్.. వైష్ణవ్ తేజ్ -రకుల్ ప్రీత్ జంటగా తెరకెక్కించిన ‘కొండపొలం’ అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందిస్తున్నారు. హేమంత్ మధుకర్, అనుష్కతో ‘నిశ్శబ్దం’ చేశారు.

Prakash Raj – Pony Verma : మా బంధానికి 11 ఏళ్లు..