Tollywood Drug Case : తనీశ్‌పై ప్రశ్నల వర్షం, ఏడు గంటలకు పైగా విచారణ

డ్రగ్స్‌ కేసులో.. హీరో తనీశ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఏడు గంటలకు పైగా విచారించింది. తనీశ్‌ బ్యాంకు ఖాతాలు, ఆడిట్‌ రిపోర్టులను పరిశీలించింది ఈడీ.

Tollywood Drug Case : తనీశ్‌పై ప్రశ్నల వర్షం, ఏడు గంటలకు పైగా విచారణ

Ed

Updated On : September 18, 2021 / 7:13 AM IST

Actor Tanish : డ్రగ్స్‌ కేసులో.. హీరో తనీశ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఏడు గంటలకు పైగా విచారించింది. తనీశ్‌ బ్యాంకు ఖాతాలు, ఆడిట్‌ రిపోర్టులను పరిశీలించింది ఈడీ. డ్రగ్స్‌ కేసు నిందితులు కెల్విన్‌, జిషాన్‌లతో తనీశ్‌కు ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీసింది. జిషాన్‌ కాంటాక్ట్‌ లిస్టులో తనీశ్‌ పేరు ఎందుకు ఉందని.. ఎఫ్‌ లాంజ్‌ క్లబ్‌లో జరిగిన ఈవెంట్స్‌, పార్టీలకు హాజరయ్యారా..? అంటూ తనీశ్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. డ్రగ్స్‌ కొనుగోళ్లు, విదేశాల నుంచి మత్తు పదార్థాల రవాణా, నగదు చెల్లింపులపైనా తనీశ్‌ నుంచి ఈడీ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

Read More : AP : పరిషత్ ఎన్నికల లెక్కింపు..ఏర్పాట్లు పూర్తి, విజయోత్సవాలు జరుపొద్దు

మనీ ల్యాండరింగ్‌, ఫెమా యాక్ట్‌ నిబంధనల ఉల్లంఘనపై ఈడీ అధికారులు సుదీర్ఘంగా తనీశ్‌ను విచారించారు. అయితే.. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానంటున్నారు హీరో తనీశ్. తన దగ్గరున్న అన్ని డాక్యుమెంట్లను ఈడీకి సమర్పించాని.. మరోసారి విచారణకు రావాలంటూ అధికారులు చెప్పలేదన్నారాయన. విచారణకు పూర్తిగా సహకరిస్తాని.. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానన్నారు తనీశ్‌. ఈనెల 22న తరుణ్‌ ఈడీ ముందు హాజరు కానున్నారు.

Read More : Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కారణమిదేనంటోన్న మాజీ సెలక్టర్

తరుణ్‌తో టాలీవుడ్‌ ప్రముఖుల విచారణ ముగుస్తుంది. ఆ తర్వాత ఈడీ యాక్షన్ ప్లాన్ ఏంటన్నది ఆసక్తిని రేపుతోంది. ఇప్పటివరకూ ఈడీ విచారణలో ఏ అంశాలను రాబట్టిందన్నది బయటపెట్టలేదు. డ్రగ్స్ కొనుగోలుకు తనీష్‌ ఏమైనా డబ్బు లావాదేవీలు జరిపారా? అన్న కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది ఈడీ. ఇందుకు సంబంధించి తనీశ్‌ బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో తనీశ్‌ జరిపిన లావాదేవీల లెక్కలపై ఆరా తీస్తున్నారు అధికారులు. అలాగే మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపైనా తనీశ్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.