AP : పరిషత్ ఎన్నికల లెక్కింపు..ఏర్పాట్లు పూర్తి, విజయోత్సవాలు జరుపొద్దు

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల లెక్కింపుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.

AP : పరిషత్ ఎన్నికల లెక్కింపు..ఏర్పాట్లు పూర్తి, విజయోత్సవాలు జరుపొద్దు

Ap Parishat

AP Parishad Elections : ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల లెక్కింపుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఆదివారం 8 గంటలకు లెక్కింపు ప్రారంభంకానుంది. అదేరోజు  ఫలితాలను వెల్లడించనున్నారు అధికారులు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అధికారులు కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. కౌంటింగ్‌ జరుగనుండడంతో… శనివారం సాయంత్రం ఐదు గంటల్లోపు ఏజెంట్ల వివరాలను ఇవ్వాలని ఎన్నికల అధికారులు పార్టీలకు ఆదేశాలు జారీ చేశారు.

Read More : GST – Nirmala Sitharaman ‘జీఎస్టీ పరిధిలో వాటిని చేర్చడం సరైన సమయం కాదు’

దీంతో సాయంత్రంలోగా ఏజెంట్ల వివరాలను అందించండంపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు జరుపవద్దని ఎస్‌ఈసీ పార్టీలకు సూచించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం వియోజత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని తెలిపింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, డీపీఓలతో  ఎస్‌ఈసీ, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాలను దగ్గర భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు.

Read More : afghan crisis :అఫ్గాన్ ఆకలి కేకలు..చంటిబిడ్డల కడుపు నింపటానికి ఇంట్లో వస్తువులు అమ్మేస్తున్న దుస్థితి

ఏపీలో మొత్తం 10 వేల 47 ఎంపీటీసీ స్థానాలు, 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. పలు కారణాలతో నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో 375 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 2020 మార్చి 7న మొత్తం 9 వేల 672 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. వీటిలో 2 వేల 371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే సుదీర్ఘ ప్రక్రియలో అభ్యర్థులు మృతి చెందిన చోట 81 స్థానాల్లో పోలింగ్ నిలిపివేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 8 న 7 వేల 220 స్థానాల్లో పోలింగ్ జరిగింది.

Read More : Japan to Hawaii Bottle message : సముద్రంలో 6వేల కి.మీటర్లు కొట్టుకొచ్చి 37ఏళ్లకు చేరిన బాటిల్ మెసేజ్..!!

మొత్తం 18 వేల 782 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏపీలో మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. 2020 మార్చి 7న 652 స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్ జారీ సమయంలో 8 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అభ్యర్థులు మృతి చెందడంతో 11 చోట్ల పోలింగ్ ఆగిపోయింది. 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 8న 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 2 వేల 58 మంది అభ్యర్థులు తమ లక్కును పరీక్షించుకుంటున్నారు.